సెప్టెంబర్ 13, గ్రహస్థితి….ఏ పని తలపెట్టినా విజయం మీదే

  • Published By: murthy ,Published On : September 12, 2020 / 07:51 AM IST
సెప్టెంబర్ 13, గ్రహస్థితి….ఏ పని తలపెట్టినా విజయం మీదే

2020 , సెప్టెంబర్ 13, ఆదివారం, నాడు ఏర్పడబోయే గ్రహ స్ధితి వల్ల ఏం జరుగబోతోంది అని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా ఆరోజు  ఉదయం సుమారు గం. 10.30 ల సమయానికి  రాశి చక్రంలోని 6 గ్రహాలు వాటి.. వాటి స్వక్షేత్రాల్లో ఉండబోతున్నాయి. ఇలాంటి అరుదైన కాంబినేషన్ మరో 250 ఏళ్ల దాకా ఉండబోదంటున్నారు జ్యోతిష్య పండితులు.ఇంతకంటే కావాల్సిన మంచి ఇంకేం ఉఁడబోతోంది. ఆరోజు సత్సంకల్పంతో చేపట్టే ఏ పనైనా విజయవంతమవుతుందంటున్నారు  జ్యోతిష్య పండితులు.




ఆ గ్రహస్థితుల వల్ల ఈ మానవాళికి ఏంజరగబోతోంది? అనే విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా జ్యోతిష శాస్ర్తంలో ప్రతి గ్రహానికీ ఓ సొంత ఇల్లు అంటూ ఉంటుంది. అలాగే ప్రతి గ్రహానికీ బలమైన స్థానాలు కూడా ఉంటాయి. అంతేకాదు చెడు స్థానాలు కూడా ఉంటాయి. బలమైన స్థానాలను ఉచ్ఛ స్థానాలని, బలహీనమైన స్థానాలను నీచ స్థానాలని జ్యోతిష శాస్ర్తం పరిభాషలో వ్యవహరిస్తుంటారు.

ఇటీవలి కాలం వరకు కాలసర్పదోషం అనే మాట మనల్ని భయపెట్టింది… కరోనా అంతకన్నా భయపెట్టింది. కాల సర్ప దోషం కల గ్రహస్ధితి వల్లే కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందాయని కూడా  జ్యోతిష్య పండితులు సెలవిచ్చారు. సెప్టెంబర్ 13 ఆదివారం ఏర్పడే గ్రహస్ధితి వల్ల ఏం జరగుతుంది అంటే …. అంతా మన మంచికే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇందుకు సంబంధించి జ్యోతిష్యులు డాక్టర్. రవి సుందర్ వడ్లమాని, ఆదివారం నాటి గ్రహస్ధితిని వివరిస్తూ విడుదల చేసిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



మనకున్న గ్రహాలు 9. వీటిలో రాహు,కేతువులు ఛాయా గ్రహాలు కాబట్టి వాటిని మినహాయిస్తే ఇంకా 7 గ్రహాలు ఉంటాయి. ఈ ఏడు గ్రహాలకూ సొంత ఇల్లు అనేది ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది  ఏమిటంటే ఎప్పుడూ ఒకేరకమైన గ్రహస్థితులు ఉండవు. భగవంతుడు మన కంటికి కనిపించకపోయినా, గ్రహస్థితులు మాత్రం ఖగోళంలో మనకు కనిపిస్తాయి. ఈ 12 రాశుల్ని, 9 గ్రహాలను సైంటిస్టులు కూడా అంగీకరిస్తున్నారు.




13వ తేదీ ప్రత్యేకత ఏమిటి ?
మన ముందు తరాలు ఎన్నడూ చూడనిది…. రాబోయే మూడు నాలుగు తరాలు చూడని గ్రహస్ధితి సెప్టెంబర్ 13 న ఏర్పడబోతోంది. ఇలాంటి అద్భుతమైన, అరుదైన, అపురూపమైన గ్రహ స్ధితి సెప్టెంబర్ 13, 2020న ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రపరంగా ఇది చాలా అరుదైన ప్రాముఖ్యం ఉన్న సంఘటన. పూర్వకాలం రామాయణంలో ….. శ్రీరామ చంద్రమూర్తి పుట్టినప్పుడు అన్ని గ్రహాలు తమ తమ ఉఛ్ఛ స్ధానాల్లో ఉన్నాయని చదువుకున్నాం. ఆ తర్వాత రావణాసురుడు తన శక్తితో, ఇంద్రజిత్తు పుడుతున్నప్పుడు అన్నిగ్రహాలని….తమ తమ స్థానాల్లోనూ….. ఉఛ్ఛస్ధానాల్లోనూ ఉండాలని ఆజ్ఞాపించాడని చదువుకున్నాం. ఆ విషయం పక్కన పెడితే రేపు అంటే 13 వ తారీకు సెప్టెంబర్ 2020 సంవత్సరం ఆదివారం నాడు ఒక పరమ అద్భుతమైన ఆస్ట్రోలాజికల్ కాంబినేషన్ రాబోతోంది




రాశి చక్రంలో ఉండే 9 గ్రహాలలో, శుక్రుడు మినహాయించి మిగిలిన 6 ఆరు గ్రహాలు వాటి వాటి సొంత ఇళ్లల్లో ఉంటున్నాయి. ఇది చాలా అరుదైన ఘటన. ఇలాంటి గ్రహ కలయిక రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లినా దొరక్కపోవచ్చు. లేదా భవిష్యత్తులో కూడా అలాంటిది ఉండకపోవచ్చు. . ఇలాంటి గ్రహస్థితి రావాలంటే చంద్రడి తోడ్పాటు కూడా అవసరం. ఎందుకంటే చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు.కనుక ఇది అత్యంత అరుదైన కలయిక అంటున్నారు జ్యోతిష్య పండితులు. చంద్రుడు ఆదివారం ఉదయం గం.10.30 కి కర్కాటక రాశిలోకి ప్రవేశించటంతో ఈ అరుదైన గ్రహ యోగం ఏర్పడబోతోంది.

పూజలు వ్రతాల్లో దేవుడ్ని కోరతాం
మనం ఏదైనా పూజ గాని, వ్రతం కానీ చేసుకునేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటాము….. అన్ని గ్రహాలు తమ తమ ప్రదేశాలలో ఉండి శుభ దృష్టితో అనుకూలమైన ఫలితాలివ్వాలి అని  కోరుకుంటాం. “ఆదిత్యాది నవగ్రహ అనుకూలత ఫలసిద్ధిరస్తు” అని చెప్పుకుంటాము. అంటే ఒక మంచి టైములో నవగ్రహాలు వాటి స్థానాల్లో, మంచి స్థానాల్లోనే ఉంటే శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. అలాంటి అరుదైన కాంబినేషన్ సెప్టెంబర్ 13 ఆదివారం ఏర్పడుతోంది. మరి అలాంటి గ్రహస్థితులు ఈరోజు ఉన్నాయంటే అంతకన్నా ప్రత్యేకమైన సమయం ఏముంటుంది. ఈరోజు మంచి ఆలోచనలతో, మంచి సంకల్పంతో మనం మంచి పనులు మొదలు పెడితే అంతకన్నా కావలసింది ఏమీ ఉండదు.



చంద్రుడు తన సొంత ఇల్లయిన కర్కాటక రాశిలోకి అడుగుపెడితే అప్పటి దాకా సొంత ఇళ్లల్లో ఉన్న ఐదు గ్రహాలకు మరో గ్రహం తోడైనట్లు అవుతుంది. ఒక్క శుక్రుడు మినహా ఆరు గ్రహాలు సొంత ఇళ్లల్లో ఉండే అరుదైన రోజు సెప్టెంబర్ 13, 2020చెప్పాల్సి ఉంటుంది. ఆ రోజు ఉదయం దాదాపు 10.30 గంటలకు చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ గ్రహస్థితులు కొనసాగుతాయి. మరో విశేషమేమిటంటే గ్రహ రాజైన రవి తన సొంత రాశిలో, సొంత నక్షత్రం ఉత్తరలో ఉండటం కూడా ఒక విశేషం అని చెప్పవచ్చు.


కనుక ఒక విధంగా చూస్తే …ఇలాంటి అరుదైన గ్రహా స్ధితికల కాంబినేషన్లో పుట్టిన పిల్లల జాతకాలు చాలావరకు బాగుంటాయి. శ్రీరాముడి జాతకంలో ఐదు గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి అని మన జ్యోతిష పండితులు చెబుతుంటారు. అది కూడా చాలా అరుదైన గ్రహాల కలయికే. శ్రీ రామచంద్రుడి జాతకంలో 5 గ్రహాలు ఉచ్ఛ క్షేత్రాల్లో ఉంటే … సెప్టెంబర్ 13, 2020 ఆదివారం వచ్చే కాంబినేషన్ లో 6గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉంటున్నాయి. వీటిలో 2 గ్రహాలు, బుధుడు, కుజుడు మూల త్రికోణ రాశిలో ఉంటారు. రావణాసురుడు కూడా తన కుమారుడు ఇంద్రజిత్తు జన్మ సమయంలో అన్ని గ్రహాలూ మంచి  స్థానాలలో ఉండాలని శాసించాడని మన పురాణాలు చెబుతుంటాయి.
https://10tv.in/hyderabad-kims-doctors-transplanted-two-lungs-in-a-corona-infected-patient-for-the-first-time-in-india/
ఇది ఎవరికి ఉపయోగం ?
అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో చక్కటి ఆరోగ్యం కోరుకునే వాళ్ళు, సరైన ఉద్యోగం ఉన్నా… ఉద్యోగంలో సంతృప్తి చెందక… ఉన్న ఉద్యోగంలో   విపరీతమైన ఒత్తిడిని… టెన్షన్ ఎదుగూ, బొదుగూ లేని జీవితం సాగిస్తున్న వాళ్ళు…… పదోన్నతి, అధికారము కావలసిన వారు……అలాగే డబ్బు విషయంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బు   సంపాదించు కోవాలి మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు రుణబాధల నుంచి విముక్తి పొందాలి అనుకునే వాళ్లు….. అంతర్గత…బాహ్యతర శత్రువుల నుంచి బయటపడాలనుకునే వాళ్లు…ఏ రకమైన రుణాలు..శత్రువుల నుంచి దూరం కావాలనుకునే వాళ్లు కానీ…ఏ రకమైన కష్టాల్లో ఉన్నా వాటి నుంచి బయటపడాలి అనుకునే వాళ్లు.. విద్యార్దులు …తమ జీవితంలో ఇది సాధించాలి….అందుకోసం  చేసే సాధనను ఈరోజు ప్రారంభిస్తున్నాననుకునే వాళ్లు కానీ…ఇలా ఏ కోరిక ఉన్నవారైనా సరే ఈ టైము ను చక్కగా సద్వినియోగ పరుచుకోవచ్చు అంటున్నారు.. జ్యోతిష్య పండితులు డాక్టర్.
రవిసుందర్.వడ్లమాని.




సెప్టెంబర్ 13, 2020 గ్రహస్థితి13th spetember 11 am planetary position

సెప్టెంబర్ 13, ఆదివారం ఉదయం గ్రహరాజైన రవి తన స్వక్షేత్రమైన సింహ రాశిలో ఉత్తరా నక్షత్రంలో ఉంటారు. తర్వాత చంద్రుడు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో ఉంటారు. బుధుడు కన్యా రాశిలో  ఉంటాడు.అదిబుధుడికి స్వక్షేత్రం, మూల త్రికోణ రాశి…ఆ తర్వాత కుజుడు మేషంలోనూ… గురుడు ధనస్సు రాశిలోనూ….. శని మకర రాశిలో ఉండటం వల్ల ఇది ఎంతో అరుదైన కాంబినేషన్.

కనుక ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వృశ్చిక లగ్నం ఉంటుంది. ఆసమయంలో చూస్తే ధన కారకుడైన గురుడు లగ్నాత్ రెండవ స్థానమైన ధనస్ధానంలో ఉంటాడు. డబ్బు సంపాదించాలి….అనుకునే వారికి గురువు, అంతర్గత, బాహ్యతర శత్రువుల నుంచి విముక్తి పొందాలంటే శని తృతీయంలో ఉండాలి. అలాగే పాపగ్రహమైన కుజుడు 6వ ఇంట ఉండాలి.. ఈ ప్రధాన గ్రహాలు 2,6,3 స్దానాల్లో ఉంటున్నాయి. జ్యోతిష్య శాస్త్రపరంగా చూస్తే అందరికీ అన్ని రకాల కోరికలు తీరాలి అంటే బుధుడు11వ ఇంట ఉండాలి.. గ్రహారాజైన రవి 10వ ఇంట ఉంటారు. ఉద్యోగంకానీ  వ్యాపారం కానీ పదవి కానీ, ఏ పనిలో అయినా విజయం కానీ, ఐహిక పరమైన అన్ని కోరికలు తీరాలంటే ప్రత్యక్షదైవం సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం ఉండాలి. ఆరోజు రవి 10 వ ఇంట్లో స్వక్షేత్రంలో స్వనక్షత్రంలో ఉంటాడు. ఇక 9వ ఇంట్లో చంద్రుడు…. దీనివల్ల ఆధ్యాత్మికతవైపు విజయం సాధిస్తారు. ఇలాంటి అరుదైన కాంబినేషన్ సెప్టెంబర్ 13న ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల పాటు అరుదైన గ్రహ స్ధితి ఉంది.




ఏం చేయాలి ?
ఆదివారం ఉదయం మీకున్న మిగతా పనులన్నీపక్కన పెట్టి…. ఉదయం గం.10-30 కల్లా శుచిగా స్నానం చేసి… దేవుడి ముందు…రెండు జిల్లేడు ఆకులు పెట్టి.. వాటిపై గుప్పెడు గోధుమలు వేసి ప్రమిద పెట్టి, రెండు వత్తులు వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత….మీ మనసులో కోరిక చెప్పుకుని…..ఆదిత్య హృదయం చదువుకోండి. లేదా…హనుమాన్ చాలీసా చదువుకోండి,  లేదా లలితా సహస్ర నామాలు లేదా..వెంకటేశ్వర స్వామి కి చెందిన స్తోత్రాలు … ఇవేవి కాదు అంటే మీరు ఏ దేవుడ్ని పూజిస్తారో….ఏ దేవుడిపై నమ్మకం ఉండి పూజిస్తారో ఆయా దేవీ, దేవతల  స్తోత్రాలు పారాయణ చేసుకోండి. సత్సంకల్పం చెప్పుకుని ఆటైమ్ ను సద్వినియోగం చేసుకుని జీవితంలో అభివృధ్ది సాధించి , సుఖ సంతోషాలతో ఉండమని జ్యోతిష పండితులు డాక్టర్ .రవి  సుందర్ వడ్లమాని సూచించారు. మనస్ఫూర్తిగా, భక్తి, శ్రద్ద, విశ్వాసంతో అరుదైన గ్రహస్దితి ఉన్న ఆదివారం నాడు భగవంతుడిని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను భగవంతుడు తీరుస్తాడని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.