Travancore Devaswom Board : శబరిమల ఆలయం 5 రోజులు ఓపెన్, నిబంధనలు వర్తిస్తాయి

కేరళ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే శబరిమల ఆలయం మళ్లీ కొద్ది రోజుల పాటు తెరవపడనుంది. నెల వారి పూజలు నిర్వహించే క్రమంలో 5 రోజుల పాటు తెరవాలని ఆలయ అధికారులు నిర్వహించారు.

Travancore Devaswom Board : శబరిమల ఆలయం 5 రోజులు ఓపెన్, నిబంధనలు వర్తిస్తాయి

Sabarimala Open

Sabarimala : కేరళ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పిలవబడే శబరిమల ఆలయం మళ్లీ కొద్ది రోజుల పాటు తెరవపడనుంది. నెల వారి పూజలు నిర్వహించే క్రమంలో 5 రోజుల పాటు తెరవాలని ఆలయ అధికారులు నిర్వహించారు. అయితే..ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గకపోవడం, జికా వైరస్ లు వెలుగు చూడడంతో పలు నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆలయం జూలై 17-21 వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుందని Travancore Devaswom Board వెల్లడించింది. భక్తులకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Read More : Delhi Police : అతిపెద్ద డ్రగ్ రాకెట్, రూ. 2 వేల 500 కోట్లు హెరాయిన్ పట్టివేత

భక్తులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు లేదా 48 గంటల్లోపు జారీ చేసిన RTPCR నెగటివ్ రిపోర్టు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్ లైన్ బుకింగ్ విధానం ద్వారా గరిష్టంగా 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తారు. గత సంవత్సరం చివరిలో భక్తుల కోసం వర్చువల్ క్యూ, ప్రసాదాలు, పూజ, వసతి వంటి సేవలను బుక్ చేసుకోవడానికి కొత్త ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read More : Mayawati : యూపీలో ‘జంగిల్ రాజ్’ న‌డుస్తుంది.. మాయావతి ఫైర్

ఆన్ లైన్ సేవలను పొందాలనే భక్తులు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ -19 ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టినా..రెండో వేవ్ దక్షిణ రాష్ట్రం అంతటా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్రంలో శనివారం 14 వేల 087 కరోనా కేసులు నమోదయ్యాయి. 30 లక్షల 53 వేల 116 మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారని, గత 24 గంటల్లో 109 మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల సంఖ్య 14 వేల 489కు చేరుకున్నాయి.