Statue of Equality : సమతామూర్తి ప్రాంగణం.. భక్తి పారవశ్యంలో శ్రీరామనగరం, వైనతేయేష్టి అంటే ఎమిటి

12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో...

Statue of Equality : సమతామూర్తి ప్రాంగణం.. భక్తి పారవశ్యంలో శ్రీరామనగరం, వైనతేయేష్టి అంటే ఎమిటి

Yagam

Samatha Murthy : ముచ్చింతల్ లో జై శ్రీమన్నారాయణ శబ్దాలతో మారుమ్రోగుతోంది. యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో ఆధ్మాత్మిక శోభ విల్లివిరుస్తోంది. త్రిదండి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది పండితులు క్రతువును నిర్వహిస్తున్నారు. మహాక్రతువుతో ముచ్చింతల్ పులకిస్తోంది. ఓం నమో నారాయణాయ…అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. భక్తీపారవశ్యంలో ముంచెత్తుతూ సమతామూర్తి సహస్రాబ్ది సమారోహం మూడోరోజు కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం.. ఏడున్నర గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు హోమాలు ప్రారంభమయ్యాయి.

Read More : Kangana Ranaut : రియాల్టీ షో హోస్ట్‌గా మారిన కంగనా.. లాంచింగ్ ఈవెంట్

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాలలో పర్యటించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి హోమాలు ప్రారంభం కానున్నాయి.. సాయంత్రం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టిని నిర్వహించనున్నారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.

Read More : Ganja Smuggling : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో పాత్ర వహిస్తుంటారన్నారు. వాహన రూపేన అయిన.. ఈ వైనతయయేష్టి విధి విధానాలతో హోమాలు చేస్తామన్నారు. కలిగిన సంతానం అభివృద్ధి చెందుతుందని శాస్త్రాలు చెబుతుంటాయన్నారు. ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉండేందుకు చేయడం జరుగుతుందన్నారు.
రుత్విజ్జులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. యాగాలతో పాటు భక్తి కార్యక్రమాలు శ్రీరామనగరంలో కొనసాగుతున్నాయి. ఉదయం అష్టాక్షరి మంత్రాన్ని స్వయంగా చిన్న జీయర్ స్వామి భక్తుల చేత ప్రవచానాన్ని చేయించారు. మధ్యాహ్నం కొంత విరామం అనంతరం సాయంత్రం లక్ష్మీ నారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది.