Indrakeeladri Temple : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై వసంత‌ ఉత్సవాలు, భక్తులు పాల్గొనాలంటే..

ఇంద్రకీలాద్రిపై వసంత‌ నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Indrakeeladri Temple : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై వసంత‌ ఉత్సవాలు, భక్తులు పాల్గొనాలంటే..

Indrakeeladri Temple : రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వసంత‌ నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, అర్చన, హారతి ఉంటుంది.

ఉదయం 9 గంటల నుంచి సర్వ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. అనంతరం కలశస్ధాపన, ప్రత్యేక పుష్పార్చనలు ఉంటాయి. వసంత‌ నవరోత్రోత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారికి మల్లెపూలు,‌ మరువంతో పుష్పార్చన చేస్తారు.

Also Read..Ugadi 2023 : షడ్రుచుల సమ్మేళనం .. ఉగాది పచ్చడితో ఆరోగ్యం

* 23న కనకాంబరాలు, ఎర్ర గులాబీలు పుష్పార్చన
* 24న తెల్ల చామంతి, ఇతర పువ్వులతో పుష్పార్చన
* 25న మందార పువ్వులు, ఎర్ర‌కలువ పువ్వులతో పుష్పార్చన
* 26న తెల్ల జిల్లేరు, తులసి, మరేడు, మరువం, ధవలం
* 27న కాగడా మల్లెలు, జాజులు, మరువం
* 28న ఎర్ర తామరలు,‌ ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులు
* 29న పసుపు చామంతి, సంపెంగలు
* 30న కనకాంబరాలు, ఎర్ర గులాబీలతో పుష్పార్చనలు
* 31న వసంత నవరోత్రోత్సవాల పూర్ణాహుతి

Also Read..Ugadi 2023 : ఉగాది పండుగ విశిష్టత .. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

వసంత‌ నవరోత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పుష్పార్చనల్లో పాల్గొనదలచిన భక్తులు www.kanakadurgamma.org సంప్రదించాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.