Sravana Masam : శివోహం..శివోహం…శంభో శంకర, ఆలయాల్లో ప్రత్యేక పూజలు

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో... ఉదయాన్నే పూజారులు... స్వామి శివలింగాకారానికి భస్మ హారతి ఇచ్చారు.

Sravana Masam : శివోహం..శివోహం…శంభో శంకర, ఆలయాల్లో ప్రత్యేక పూజలు

Lord Shiva

Varanasi : హరహర మహాదేవ… శంభో శంకర అంటూ… మధ్యప్రదేశ్ ఉజ్జయినీ మహాకాళేశ్వర స్వామి ఆలయం మార్మోగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో ముక్కంటిని దర్శించుకుంటున్నారు. శ్రావణ మాసం రావడంతో… ప్రతి రోజూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో… ఉదయాన్నే పూజారులు… స్వామి శివలింగాకారానికి భస్మ హారతి ఇచ్చారు. అత్యంత అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు.

Read More : Kabul Airport Chaos : కాబూల్ ఎయిర్ పోర్టులో కాల్పులు.. ఐదుగురు మృతి

పరమ శివుణ్ని ధ్యానిస్తూ… హరహర మహాదేవ అంటూ… భక్తి తన్మయత్వంలో మునిగిపోయారు. వారణాసిలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. యూపీలోని వారణాసిలో విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు.. భక్తులు బారులు తీరారు. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతోంది. ప్రతీయేటా కాశీలో శ్రావణ సోమవారాల్లో భక్తుల తాకిడి నెలకొంటుంది. ఈసారి కరోనా నియమాల కారణంగా భక్తులను గర్భాలయంలోకి ప్రవేశం కల్పించడం లేదు. అలాగే స్పర్శ దర్శనాలను కూడా రద్దు చేశారు.

Read More : Afghan Airspace Closed :అఫ్గానిస్థాన్ గగనతలం మూసివేత..విమానాల రాకపోకలు నిలిపివేత

వారణాసి జిల్లాలో కాశీ విశ్వేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు కాశీ విశ్వేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. గంగా నదిలో స్నానం చేస్తే..పాపాలు నశించి..పునర్జన్మ నుంచి విముక్తులవుతారని నమ్మకం. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. పవిత్రమైన గంగా నదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయంటుంటారు. దీంతో దీనికి వారణాసి నే పేరు వచ్చిందని చెబుతుంటారు. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని…శివుడి త్రిశూలం పైన కాశీనగరం నిర్మించబడిందని పురాణాలు చెబుతుంటాయి.