Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి

సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...

Statue Of Equality : సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం.. యాగశాలలో విష్వక్సేనేష్టి

Samatha Murthy

Statue Of Equality Muchintal: సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా 2022, ఫిబ్రవరి 05వ తేదీ శనివారం ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమాలకు మోదీతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవుతారు.

Read More : AP PRC: పీఆర్సీపై నేడు కీలక పరిణామాలు.. మధ్యాహ్నం సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ..?

వసంత పంచమి సందర్భంగా యాగశాలలో విష్వక్సేనేష్టి నిర్వహిస్తున్నారు. ఈ యాగాన్ని ఎవరైనా తన లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవాలని చేస్తుంటారు. ప్రధాని మోదీ తలపెట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని విష్వక్సేనేష్టిని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. అటు సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్‌ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా బెంగళూరుతో పాటు విదేశాల నుంచి తెప్పించిన వందకు పైగా రకాల పుష్పాలతో కేంద్రాన్ని అందంగా అలంకరించారు. ఇక రుత్విజుల ఆధ్వర్యంలో యాగశాలల్లో జరిగిన వేదపారాయణం శాస్త్రోక్తంగా సాగింది. నాలుగు వేదాల్లోని 9 శాఖలను పారాయణం చేసే క్రతువును రుత్విజులు చేపట్టారు.

Read More : Girlfriend : నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. గర్ల్ ఫ్రెండ్‌ను ట్రాలీ బ్యాగులో తీసుకొచ్చి ఎంజాయ్ చేయాలనుకున్నాడు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమకుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లనున్నాయి.

Read More : AP High Court : చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది.. ఉద్యోగుల సమ్మె హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది. పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా మధ్య భాగానికి పుష్ప మండపమని, కాంచీపురానికి గుర్తుగా వెనుక వైపు ఉన్న భాగానికి త్యాగ మండపం, మేల్కోట క్షేత్రాన్ని తలచుకుంటూ ఎడమ వైపు ఉన్న మండపానికి జ్ఞాన మండపం అన్న నామకరణం చేసారు. ఆపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు ప్రారంభమయింది.