TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.41 కోట్లు, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...

TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.41 కోట్లు, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Ttd

Sri Kapileswara Swamy Brahmotsavam : పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు భక్తులు తరలివస్తున్నారు. కరోనా కారణంగా టీటీడీ ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో శ్రీవారి దర్శన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొంటోంది.  తిరుమలలో శ్రీవారిని 2022, ఫిబ్రవరి 25వ తేదీ శుక్రవారం 56 వేల 559 భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. కానుకల రూపేణ శ్రీవారికి రూ. 5.41 కోట్ల ఆదాయం వచ్చిందని, 28 వేల 751 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారన్నారు.

Read More : TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.84కోట్ల విరాళం

సామాన్య భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అందుకు అనుగుణంగా దర్శన టోకెన్లు జారీ చేయడం జరుగుతుందని, సర్వదర్శనం భక్తులకు రోజుకు 30వేల టోకెన్లు జారీ చేస్తుండగా.. మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుందని అంచనా. ఇక ఇదిలా ఉంటే…తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నులు పండుగగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు శనివారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి అవతారంలో దర్శనమిచ్చారు.

Read More : Kapileswara Swamy : కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే

అయితే.. కోవిడ్ నిబంధనల ప్రకారం… వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు అర్చకులు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్ రెడ్డి శేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల వివరాలు :-
22-02-2022 (ఉదయం) ధ్వజారోహణం (మీన‌లగ్నం) (సాయంత్రం) హంస వాహనం
23-02-2022 (ఉదయం) సూర్యప్రభ వాహనం. (సాయంత్రం) చంద్రప్రభ వాహనం
24-02-2022 (ఉదయం) భూత వాహనం. (సాయంత్రం) సింహ వాహనం
25-02-2022 (ఉదయం) మకర వాహనం (సాయంత్రం)  శేష వాహనం

26-02-2022 (ఉదయం) తిరుచ్చి ఉత్సవం. (సాయంత్రం) అధికారనంది వాహనం
27-02-2022 (ఉదయం) వ్యాఘ్ర వాహనం. (సాయంత్రం) గజ వాహనం
28-02-2022  (ఉదయం) కల్పవృక్ష వాహనం. (సాయంత్రం) అశ్వవాహనం
01-03-2022 (ఉదయం) రథోత్సవం(భోగితేరు). (సాయంత్రం) నందివాహనం
02-03-2022 (ఉదయం) పురుషా మృగవాహనం. (సాయంత్రం) కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
03-03-2022 (ఉదయం) శ్రీ నటరాజ స్వామి వారి రావణాసుర వాహనం. సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. (సాయంత్రం) ధ్వజావరోహణం.