Sri Rama Navami 2023 : సుడిగుండాల జీవితం రామయ్యది .. అయినా శ్రీరాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఆదర్శంగా ఎలా నిలిచాడు?

సుడిగుండాల జీవితం రామయ్యది .. అయినా శ్రీరాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఆదర్శంగా ఎలా నిలిచాడు? ఈనాటికీ శ్రీరాముడిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నారో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా తెలుసుకుందాం..మన జీవితాలను అన్వయించుకుందాం..

Sri Rama Navami 2023 : సుడిగుండాల జీవితం రామయ్యది .. అయినా శ్రీరాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఆదర్శంగా ఎలా నిలిచాడు?

Sri Rama Navami 2023..

Sri Rama Navami 2023 : ఒక కొడుకు ఎలా ఉండాలో శ్రీరాముడే ఆదర్శం. ఒక భర్త ఎలా ఉండాలో సీతామనోభిరాముడే ఆదర్శం. ఒక అన్న ఎలా ఉండాలో అయోధ్యరాముడే ఆదర్శం. ఇలా రాముడు జీవితంలో ఎన్నో గొప్ప విశేషాలు ఈ సమాజానికి మార్గదర్శకం. ఒకే బాణం ఒకే భార్య శ్రీరాముడు జీవితం. తండ్రి మాట కోసం 14 ఏళ్ల కారడవిలో జీవించిన గొప్ప కొడుకు రాముడు. ఒక అన్నగా లక్ష్మణులు, భరత,శతఘ్నులకు అన్న రాముడే మార్గదర్శకుడు. ఆదర్శప్రాయుడు. 14 ఏళ్లు రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు భరతుడు రాముడు పాదుకలతోనే పాలన చేశాడు. కానీ సింహాసనాన్ని అధిష్టించలేదు. రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చాక పట్టాభిషిక్తుడు అయి రాజ్యపాలన చేపట్టాడు. అలా రాముడి జీవితం ఆదర్శప్రాయంగా నిలిచింది.

శ్రీరాముడు దసరధ మహారాజు తొలి సంతానమే అయినా ఏనాడు రాజభోగ్యాలు అనుభవించలేదు. చిన్ననాడు విశ్వామిత్రుడితో కలిసి అడవులకు వెళ్లాడు. సీతను వివాహం చేసుకున్నాక రాజ్యపాలన జేష్టుడు అయిన శ్రీరాముడికే పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించాలనుకున్నాడు. కానీ మూడవ భార్య కౌకేయికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాముడ్ని వనవాసానికి వెళ్లమంటాడు. తండ్రి మాటను జవదాటని రాముడు పితృవాక్య పరిపాలకకుడిగా 14 ఏళ్లు వనవాసానికి వెళతాడు. పితృవాక్య పరిపాలనను అనుసరించి ఆయన తన రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అడవుల పాలవ్వాల్సి వస్తుంది. సీత రాముడ్ని వదిలి ఉండలేక భర్తతోనే అడవులకు పయనమవుతుంది.

Sri Rama Navami 2023 : శ్రీరామడికి ప్రీతికరమైన ‘పానకం,వడపప్పు’ ప్రసాదాల్లో ఆరోగ్య పరమార్థం..

అలాగే లక్ష్మణుడు అన్నను వదిలి ఉండలేక తాను కూడా అన్నావదినలను అనుసరిస్తాడు. వనవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోతాడు. సీతా వియోగంతో రాముడు కుమిలిపోతాడు. అనుక్షణం సీతమ్మ జ్ఞాపకాలతో తల్లడిల్లిపోతాడు. ఆ తర్వాత ఆమె జాడను కనుగొని తనకు ఇష్టం లేకపోయినా రావణుడితో యుద్ధం చేసి సంహరించి సీతమ్మను అగ్నిప్రవేశం చేయించి పునీతగా తనతో రాజ్యానికి తీసుకెళతాడు. కానీ అప్పటికే రాముడిపై బెంగ పెట్టుకుని దసరధుడు కన్నుమూస్తాడు. అయోధ్యకు చేరుకున్నాక రాముడికి పట్టాభిషేకం అంగరంగ వైభోగంగా జరుగుతుంది.

రాజ్యపాలన చేస్తూ కాస్త సుఖంగా ఉన్నాడనగా..సీతమ్మపై పడిన అపవాదులు వినాల్సి వస్తుంది. అప్పటికే సీతమ్మ గర్భవతి. అటువంటి దశలో ఉన్న సీతమ్మను,తన ప్రాణానికి ప్రాణమైన సీతను అడవులకు పంపిస్తాడు అయోధ్యరాముడు. అది ప్రజల కోసం. ఓ చాకలివాడు సీతమ్మ గురించి మాట్లాడిన మాటలకు సీతను తిరిగి అడవుల పాలు చేస్తాడు రాముడు. రాముడి పాలనలో సుఖసంతోషాలతో జీవించే ప్రజల్లో ఎవరో ఏదో అన్నారని ప్రజల వాక్కుని గౌరవించిని రాముడు నిండు గర్భిణిగా ఉన్న సీతమ్మను అడవులకు పంపిస్తాడు.

ఆ తర్వాత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో కవలలు లవకుశులకు జన్మినిచ్చిన సీత ఆశ్రమంలోనే జీవిస్తుంటుంది. సీతమ్మ వియోగంతో రాముడు తల్లిడిల్లిపోతుంటాడు. ఇటువంటి అశాంతి జీవితంతో ఈ రాజ్యపాలన వద్దని తమ్ములకు అప్పగించాలనుకుంటాడు. కానీ తమ్ములు అంగీకరించరు. నువ్వే రాజుగా ఉండాలంటారు. ఇలా రాముడు సీత వియోగంతో అహర్నిశలు తపించిపోతుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాముడితో అశ్వమేథ యాగం చేయిస్తారు పండితులు. ఆ అశ్వాన్ని కట్టేస్తారు శ్రీరాముడి కుమారులు లవకుశులు. దీంతో అశ్వాన్ని విడిపించటానికి తన కుమారులు అని తెలియకుండానే వారితో యుద్ధం చేస్తాడు రాముడు.

Sri Ram Navami 2023 : ‘నవమి’ రోజే శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలు

ఆ భీకర యుద్ధం గురించి తెలిసిన సీతమ్మ తల్లడిల్లిపోతుంది. తండ్రీ కొడుకులకు యుద్ధమా? అంటూ సీత రణస్థలికి రావడం, పుత్రులను రామునికి అప్పగించి ఆమె భూమాత ఒడిలోకి వెళ్లిపోవడంతో ఇక శాశ్వతంగా సీతకు దూరమవుతాడు శ్రీరాముడు. . ఇలా రాముడి జీవితం ముగుస్తుంది. ఆయన జీవితాన్ని గమనిస్తే ఎన్నో సమస్యల సుడిగుండంలో సాగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఐనప్పటికీ శ్రీరాముడు ఆదర్శప్రాయుడుగా పేరొందాడు. ఇక్కడ కూడా శ్రీరాముడు ఆదర్శంగానే నిలిచాడు.

శ్రీరామ చంద్రుడికి ఎన్నో సమస్యలు ఎదురైన మాట నిజమే. కానీ ఆయన వాటిని ఎలా ఎదుర్కొన్నాడనేది చాలా ముఖ్యం.. శ్రీ మహా విష్ణువు అవతారం శ్రీరాముడు. రామావతారంలో ఓ సాధారణ మనిషి పడే కష్టాలనే రాముడు కూడా ఎదుర్కొంటాడు. ఎక్కడా దైవత్వం గురించి ఉండదు ఈ అవతారంలో. అలాగే ఓ సాధారణ మనిషిలాగానే సమస్యలను సామరస్యంగా ఎదుర్కొంటాడు. ప్రతీ మనిషి జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో శ్రీరాముడు వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది.

అశ్వమేథ యాగంలో దశరథ మహారాజు గుర్రాన్ని దేశటనం కోసం విడుస్తారు. అది దేశంలో నలుమూలలా తిరిగి చివరికి రాజ్యానికి చేరుతుంది. సహజంగా అశ్వమేథ యాగంలో పాల్గొన్న గుర్రాన్ని యాగంలో భాగంగా బలి ఇచ్చే సంప్రదాయం అప్పట్లో ఉండేది. దానితో గుర్రాన్ని బలి ఇవ్వాలని దశరథుడు ఆజ్ఞాపించేందుకు సిద్ధమవుతుండగా..రాముడు దాన్ని అడ్డుకుంటాడు. తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. తండ్రి మాట జవదాటని రాముడు ఓ జంతువు విషయంలో పెదవి విప్పుతాడు. అంటే చెడుని ప్రశ్నించటానికి ఎదుర్కోవటానికి దేనికి వెనుకాడకూడదని రాముడిని చూసి తెలుసుకోవాలి. రాజ్యానికి ఎదురులేదని దేశం మొత్తం తిరిగి చాటిచెప్పిన గుర్రానికి మనమిచ్చే బహుమతి ఇదా…? దాన్ని బలి ఇస్తారా? ఇది సరైందికాదని స్పష్టంచేయటం రాముడి గొప్పతనానికి నిదర్శనం.

కానీ రాముడి మాటలు రాజ్యంలో ఎవ్వరికి నచ్చవు. ప్రజలంతా గుర్రాన్ని బలి ఇచ్చి తీరాల్సిందేనంటూ నినాదాలు చేస్తారు. ఆ సమయంలో దశరథుడికి ఏం చేయాలో అయోమయంలో పడతాడు. ఇటు తనకు అత్యంత ఇష్టమైన కొడుకు మాట..అటు ప్రజల మాట..ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోతాడు దశరధుడు. కానీ గుర్రాన్ని బలి ఇచ్చేందుకు ససేమిరా అంటాడు రాముడు. దానితో ఏం చేయాలో పాలుపోని దశరథుడు మంత్రితో ఏం చేయాలో సలహా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు మంత్రి శ్రీరామచంద్రునితో… కుమారా రామా… నువ్వు చెప్పదలచుకున్నది ప్రజలకు స్పష్టంగా తెలియజేయి. ప్రజామోదం నీకు పూర్తిగా లభించినట్లయితే నీ అభీష్టము మేరకు గుర్రాన్ని బలి ఇవ్వడం ఆపవచ్చు అని చెపుతాడు.

Sri Rama Navami 2023 : శ్రీరామ నవమి విశిష్టత .. రామయ్య జన్మించిన అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో తెలుసా?

అప్పుడు శ్రీరామచంద్రుడు గుర్రం అన్ని దిక్కులా తిరిగి రాజ్యానికి వచ్చి మన రాజ్యం గౌరవాన్ని ఇనుమడింపజేసిందనీ, మన గౌరవాన్ని, తిరుగులేని విజయాలను వెంటబెట్టుకుని వచ్చిన ఈ గుర్రానికి మనం ఇచ్చే బహుమతి దాన్ని హత్య చేయడమా..? ఇది నేను అంగీకరించడం లేదు. నాతో ఏకీభవించేవారు నాతో చేయి కలపండి. కాదన్నవారు తమతమ సూచనలు చేయవచ్చు అని తెలుపుతాడు. రాముడి మాటలకు రాజ్యంలో కొద్దిసేపు నిశ్శబ్దం. తొలుత ఓ వృద్ధురాలు, రామయ్య నిర్ణయాన్ని నేను ఆమోదిస్తున్నా అని ముందుకొచ్చి చెబుతుంది. అలా మరొకరు..ఆ తరువాత ఇంకొకరు..రాముడికి అలా రాజ్యంలోని వారంతా రాముడి నిర్ణయమే మా నిర్ణయం అని ఏకీభవిస్తారు.

ఈ క్రమంలో శ్రీరాముడి జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను అధిగమించిన తీరు ఈనాటికి ప్రతీ మనిషికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సమస్యల నుంచి పారిపోయే పిరికివాడిలా కాక ధైర్యంగా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుని దానికి కట్టుబడి ఉండాలో రాముడి జీవితం చెబుతోంది. సమస్యలపై పోరాడిన తీరును చూసి ఆదర్శమూర్తిగా ఆయనను కొలిచారు.ఈనాటికి కొలుస్తూనే ఉన్నారు. అంతేకాదు కోతులతో కూడా వారధిని కట్టించిన రాముడి గొప్పతనం..కోతులను ఓ బృహత్తర పనికోసం నడిపించిన తీరు రాముడిలో ఉన్న గొప్పలక్షణం కనిపిస్తుంది. అలా శ్రీరామ చంద్రుడు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఆయన జీవితమే ఎందరికో..