Srinivasa Kalyanam : అమెరికాలో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

Srinivasa Kalyanam : అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవ క్రతువు ఇలా సాగింది.
పుణ్యాహవాచనం: కల్యాణోత్సవం ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ.
విశ్వక్సేన ఆరాధన: విశ్వక్సేనుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతి. స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ముందు ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తారు.
శుద్ధి: కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లుతారు.
అంకురార్పణ: అంకురార్పణ ఏదైనా పుణ్య కార్యానికి ముందు నిర్వహించే వైదిక క్రతువు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు.
ప్రతిష్టా బంధన: కల్యాణం లో ఇది మరొక ప్రధాన భాగం. అర్చకులు పవిత్రమైన కంకణాలను (పవిత్ర దారాలు) స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల చేతులకు కడతారు.
అగ్ని ప్రతిష్ట: పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు.
వస్త్ర సమర్పణ: అగ్నిప్రతిష్ఠానంతరం దేవతలకు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు.

Srinivasa Kalyanam
మహా సంకల్పం: తాళ్లపాక వంశస్థులు (గత 600 సంవత్సరాల నుండి వేంకటేశ్వరుని సేవలో తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం) అమ్మవారి తరపున కన్యాదానం చేసే ఆచారం ఇది. ఇందుకోసం మహా సంకల్పం జరిగింది.
కన్యాదానం: కళ్యాణంలో, కన్యాదానానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ భగవంతుడు మరియు అతని భార్యల గోత్ర ప్రవరాలను పూజారులు పఠించారు.
మహోత్సవం: వేంకటేశ్వరుడు తన ప్రియమైన భార్యలకు పవిత్ర మంగళ సూత్రాలను కట్టిన మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
వారణమాయిరం: ఇది సాధారణంగా దక్షిణ భారత హిందూ వివాహాల సమయంలో నిర్వహించబడే ప్రముఖమైన, వినోదాత్మకమైన క్రతువు. ఇందులో స్వామివారు అతని దేవేరులు ఒకరికొకరుఎదురుగా పూల బంతులు మరియు కొబ్బరికాయలతో ఆడుకున్నారు. (ఇక్కడ దేవతల తరపున పూజారులు మరియు తాళ్లపాక వంశస్థులు ఈ ఆచారాన్ని నిర్వహించారు). అనంతరం దేవతామూర్తులకు పూలమాలలు మార్చుకున్నారు.
హారతి: శ్రీదేవి కుడి వైపున, భూదేవి ఎడమ వైపున కూర్చున్నారు. చివరగా కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి తో కళ్యాణోత్సవం ముగిసింది.
శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ శ్రీ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
- APSRTC : పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలతో తిరుమల భక్తులపై పెనుభారం
- Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
- Ukraine: యుద్ధం కొనసాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్
- Srinivasamangapuram : శ్రీనివాస మంగాపురంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- Mahesh Babu : బిల్‌గేట్స్ తో మహేష్ మంతనాలు.. వైరల్ గా మారిన ఫొటో
1Jagga Reddy On Fire : కాంగ్రెస్‌లో మరో కలకలం.. రేపు సంచలన ప్రకటన చేయనున్న జగ్గారెడ్డి
2Admissions : సెస్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు
3IndiGo Flights: దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ఆలస్యం
4Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
5Lokesh Kanagaraj : మిమ్మల్ని కలుస్తాను.. విక్రమ్ డైరెక్టర్ తో మహేష్ మీట్.. సినిమా ఛాన్స్?
6BJP: ‘మెంటల్ ట్రీట్మెంట్ తీసుకో’ అంటూ రాజస్థాన్ సీఎంకు సూచించిన బీజేపీ ఎంపీ
7Hyderabad: ‘విజయ సంకల్ప’ సభకు హాజరైన గద్దర్.. బీజేపీ తీర్థంపుచ్చుకోనున్న విశ్వేశ్వరరెడ్డి
8Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
9BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
10India vs England: భారత బౌలర్ల ధాటికి రాణించలేకపోతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం