TTD : త్వరలో ఆఫ్‌‌లైన్‌‌లో శ్రీవారి దర్శన టికెట్లు

కోవిడ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ దర్శనం టోకెన్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే...ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం...

TTD : త్వరలో ఆఫ్‌‌లైన్‌‌లో శ్రీవారి దర్శన టికెట్లు

Yv Subbareddy

Srivari Darshan : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సామాన్య భక్తుల కోసం త్వరలోనే ఆఫ్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు కల్పించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ లో దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లు విజృంభిస్తుండడంతో టీటీడీ పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. భక్తుల దర్శన విషయంలో కూడా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read More : Kinnera Mogulaiah : కిన్నెర మొగులయ్యకు కోటి రూపాయలు, ఇంటి స్థలం ప్రకటించిన కేసీఆర్

కోవిడ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ దర్శనం టోకెన్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే…ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారని, నిపుణుల సూచన మేరకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు మాత్రమే ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు.

Read More : Chandrababu Naidu : అంధకారంలో రాష్ట్ర భవిష్యత్తు.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న చంద్రబాబు

ఇదిలా ఉంటే…ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌లో 3 వందల రూపాయల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసింది. శనివారం ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. సర్వదర్శనం టోకెన్లు రోజుకు 10 వేల చొప్పున ఆన్‌‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు.