TTD : దేవస్థానంలో జంబో కమిటీ, అదృష్టవంతులెవరో

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?

TTD : దేవస్థానంలో జంబో కమిటీ, అదృష్టవంతులెవరో

Ttd Board Members

TTD Board Members : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా? టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బోర్డు సభ్యుల ఎంపికపై ప్రభుత్వం దృష్టిసారించింది. అయితే బోర్డు సభ్యత్వం కోసం భారీగా పోటీ నెలకొంది. భారీ సంఖ్యలో సిఫార్సులు వచ్చినట్లు సమాచారం. కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్ నుంచి కూడా సిఫారసు లెటర్స్‌ వచ్చినట్టు సమాచారం.

Read More : Guntur : అందరూ చూస్తుండగానే రమ్యను పది సార్లు పొడిచాడు, చూస్తూ ఊరుకున్న జనం

తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి కూడా పలు సిఫార్సులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరుకాకుండా సీఎం జగన్ మిత్రులు, వైసీపీ కీలక నేతల బంధు మిత్రులు, మహారాష్ట్ర పారిశ్రామికవేత్తలు నుంచి సిఫారసులు వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు సభ్యులుగా తాము చెప్పినవారిని నియమించాలంటూ ప్రభుత్వానికి ఇప్పటివరకు 70 కి పైగా సిఫారసులు వచ్చినట్టు సమాచారం. వీరిలో ఎంత వడపోసినా అందులో 53 మందిని తొలగించడానికి అసలు సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. దీంతో బోర్డు సభ్యుల ఎంపిక కత్తిమీద సాములా మారింది.

Read More : Suresh Raina : ధోనీతో ఒకేరోజు రిటైర్మెంట్‌‌.. రివీల్ చేసిన సురేశ్‌ రైనా..!

తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పాలకమండిలో 53 మందికి చోటు కల్పించాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో పాలకమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 55కు చేరనుంది.
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ఈసారి జంబో పాలకమండలిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను 55 వరకూ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ జంబో పాలకమండలిలో చోటు దక్కించుకునే అదృష్టవంతులెవరో చూడాలి మరి.