TTD : సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ

తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొంది.

TTD : సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ

Ttd

TTD : తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 15 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీవారి వాహనసేవల వివరాలను టీటీడీ ప్రకటించింది. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఉత్సవాలకు ముందు 5న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించింది. అక్టోబర్‌ 6 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని టీటీడీ తెలిపింది.

Read More : Yadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖాజానకు రూ. 15,47,185 ఆదాయం

ఉత్సవాల విశేషాలు
7న ఉదయం ధ్వజారోహణం – సాయంత్రం పెద్దశేష వాహనసేవ
8న ఉదయం చిన్నశేష వాహ‌నసేవ – సాయంత్రం హంస వాహనసేవ
9న ఉదయం సింహవాహన సేవ – సాయంత్రం ముత్యపు పందిరి వాహనసేవ
10న ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నసేవ – సాయంత్రం సర్వభూపాల వాహనసేవ
11న ఉదయం మోహినీ అవతారం – సాయంత్రం గరుడ వాహనసేవ
12న ఉదయం హ‌నుమంత వాహ‌నసేవ – సాయంత్రం గజ వాహనసేవ
13న ఉదయం సూర్యప్రభ వాహ‌నసేవ – సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ
14న ఉదయం సర్వభూపాల వాహనసేవ (రథోత్సవంకు బదులు) – సాయంత్రం అశ్వవాహనసేవ
15న ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం – సాయంత్రం ధ్వజారోహణం

మరోవైపు అక్టోబర్ 7 నుంచి 15 వరకు ఏపీలో దసరా ఉత్సవాలు జరపనున్నట్లు తాజాగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు.

Read More : Dussehra Celebrations : ఏపీలో అక్టోబర్ 7 నుంచి దసరా ఉత్సవాలు