Tirumala Sri Vari Darshan : ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్ ద్వారా శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీ వారిని దర్శించుకునేందుకు తిరుమల  తిరుపతి దేవస్దానం 300 రూపాయలు, ఉచిత దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది.

Tirumala Sri Vari Darshan : ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ బుకింగ్ ద్వారా శ్రీవారి దర్శనం

Ttd Apsrtc

Tirumala Sri Vari Darshan :  తిరుమల శ్రీ వారిని దర్శించుకునేందుకు తిరుమల  తిరుపతి దేవస్దానం 300 రూపాయలు, ఉచిత దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది. విడుదల చేసిన    కొద్ది నిమిషాల్లోనే నెలకు సరిపడా టికెట్లను భక్తులు బుక్ చేసుకుంటున్నారు. పరిమతి సంఖ్యలో టీటీడీ టికెట్లు విడుదల చేస్తూ ఉండటంతో భక్తులు ఎక్కవ మందికి అవి లభ్యం కావటంలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఈ సమయంలో టికెట్‌ దొరకని  వారి కోసం టీటీడీ, ఏపీఎస్‌ ఆర్టీసీ తో కలిసి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల కల్పించింది. ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Also Read : Bandi Sanjay on KCR: ముఖ్యమంత్రి అప్పటివరకూ స్పందించరు..!

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం  కోసం వచ్చే భక్తులు www.apsrtconline.in వెబ్‌సైట్‌లో ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్‌ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటల మధ్య   తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్‌ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్‌ వైజర్లు సహాయం చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీఎస్‌ఆర్‌టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడిపిస్తోంది.

టీటీడీ అధికారులు ఆధ్మాత్మిక కోణంలో ఆలోచించి ఇచ్చిన దర్శన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.   విజయవాడ,గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌ మొదలైన ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్‌లైన్‌ విధానంలో టికెట్స్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఒరిజినల్‌ ఇడీ ప్రూఫ్,ఆర్టీసీ టికెట్స్‌ జిరాక్స్‌ కాపీ ,  టీటీడీ నిభందనల మేరకు సాంప్రదాయ వస్త్ర ధారణలో వచ్చే  భక్తులను టీటీడీ అనుమతి ఇస్తోందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు.