TTD Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేడు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల  బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో  భాగంగా ఇవాళ ఉదయం 9 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారంలో పల్లకిపై మలయప్ప స్వామి దర్శ

10TV Telugu News

TTD Brahmotsavam :  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల  బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో  భాగంగా ఇవాళ ఉదయం 9 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారంలో పల్లకిపై మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు.

రాత్రి 7 నుండి 8.30 వరకు గరుడ వాహనంపై స్వామి దర్శనమిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలు అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.

మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయం అందించిన వివిరాల ప్రకారం ముఖ్యమంత్రి జగన్ పర్యటు.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్.. 3 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బర్డ్ హాస్పటిల్‌కు చేరుకుంటారు. అక్కడ చిన్న పిల్లల గుండె జబ్బుల చికిత్స ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అటునుంచి అలిపిరి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడకదారి, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభిస్తారు.

Also Read : Dasara Festivities : అన్నపూర్ణా దేవిగా, శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు అభయమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ

సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం నడకదారిలో శ్రీవారి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుని, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలేశుడి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిథి గృహానికి చేరుకురి.. ఈ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు.

రేపు మంగళవారం 12వ తేదీ ఉదయం ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ చానళ్ళను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్ధ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత పద్మావతి అతిధి గృహానికి చేరుకుని.. అటునుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు తిరుగుపయనం అవుతారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో బయలు దేరి…. ఉదయం గం.11.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.