thali bottu : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, తాళి బొట్టు బంగారం, గ్రాము కాదు..రెండు గ్రాముల గోల్డ్

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది.

thali bottu : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, తాళి బొట్టు బంగారం, గ్రాము కాదు..రెండు గ్రాముల గోల్డ్

Gold

ttd : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది. కళ్యాణమస్తు కార్యక్రమంలో పాల్గొనే నిరుపేద జంటలకు ఈ కానుక అందించనుంది టీటీడీ. ఇప్పటికే ట్రేజరిలో వున్న 20 వేల బంగారు తాళిబొట్టు కళ్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ వినియోగించుకోనుంది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహుర్తాలు ఖరారు చేశారు పండితులు. కళ్యాణమస్తు లగ్నపత్రికని స్వామివారి పాదాల చెంత వుంచి పూజలు నిర్వహించారు అర్చకులు.

పదేళ్ల క్రితం ఆపేసిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. ఇందులో భాగంగా లబ్దిదారులకు తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు వెల్లడించింది. మే 28, అక్టోబర్ 30, నవంబర్ 17వ తేదీలలో కళ్యాణమస్తు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో జవహర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కళ్యాణమస్తు నిర్వహించే ప్రాంతాలను పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఆర్థిక భారం పెరగడం, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో ఈ కార్యక్రమాన్ని 2011 మార్చిలో రద్దు చేశారు.