Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం.. వాటిలో మార్పులు

Tirumala : వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు.

Tirumala TTD : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. సామాన్య భక్తుల సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు కిలోమీటర్ల మేర ఉన్నాయి.

Also Read..Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం

సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి .. దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేయడం జరిగిందని టీటీడీ చైర్మన్ తెలిపారు.

” శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేయడం వలన 20 నిమిషాల సమయం ఆదా అయ్యింది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించడం వలన 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు రద్దు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం. దీని వలన ప్రతిరోజు 3 గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం అవుతుంది” అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Also Read..Gnanavatarulu Sri Yukteswar Giri : భయం ముఖంలోకి చూడండి..అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తుంది : జ్ఞానావతారులు శ్రీ యుక్తేశ్వర్ గిరి దివ్య సందేశాలు

ఇక, ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది టీటీడీ. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లను ఉంచుతారు.

ట్రెండింగ్ వార్తలు