TTD : న్యూ ఇయర్ తొలిరోజు శ్రీవారి ఆదాయం రూ.2.15 కోట్లు

కొత్త సంవత్సరం మొదటి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జనవరి 1న స్వామివారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు.

TTD : కొత్త సంవత్సరం మొదటి రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జనవరి 1న స్వామివారిని 36,560 మంది భక్తులు దర్శించుకున్నారు. ఒకరు రోజు హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు వచ్చింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల్లో 14,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శనివారం స్వామివారిని రాజకీయ నేతలతోపాటు సినీ ప్రముఖులు.. జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజు కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది.

చదవండి : TTD Calendar : ఆరు పేజీల ప్ర‌త్యేక క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్‌, ధర రూ.450

ఇక ఇదిలా ఉంటే 2021 జనవరి 1 నుంచి డిసెంబర్ 30 మధ్య కాలంలో శ్రీవారి ‘హుండీ’ వసూళ్లు రూ. 833 కోట్లని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గతేడాది స్వామివారిని 1.04 కోట్ల మంది ఉన్నారు. ప్రసాదం లడ్డులు 5.96 కోట్లు, 1.37 కోట్ల అన్నప్రసాదాన్ని విక్రయించింది టీటీడీ. 48.75 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. దీంతో 2021 ఏడాదిలో 1 కోటి మంది భక్తులు తిరుమలను సందర్శించారని .. హుండీ వసూళ్లు మొత్తం రూ.833 కోట్లని ప్రకటించింది.

చదవండి : TTD : జనవరిలో శ్రీవారి విశేష ఉత్సవాలు..వివరాలు..ఏమేం ఉన్నాయంటే

 

ట్రెండింగ్ వార్తలు