Tirumala Brahmotsavam : 7 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ‌ర‌కు జరగనున్నాయి.

Tirumala Brahmotsavam : 7 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Sri Varshika Brahmotsavalu 2021

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి 15 వ‌ర‌కు జరగనున్నాయి. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో రేపు శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.

ఈ నెల 6న సాయంత్రం 6 గంట‌ల‌కు  బ్రహ్మోత్సవాల‌కు అంకురార్ప‌ణ చేయ‌నున్నారు. 15వ తేదీన రాత్రి ధ్వ‌జావరోహ‌ణ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి. క‌రోనా కార‌ణంగా శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.


7న
ధ్వ‌జారోహ‌ణం, పెద్ద‌శేష వాహ‌న‌సేన‌
8న చిన్న‌శేష వాహ‌న‌సేవ‌, రాత్రికి హంస వాహ‌న‌సేవ‌
9న సింహ, ముత్య‌పు పందిరి వాహ‌న‌సేవ‌లు
10న క‌ల్ప‌వృక్ష‌, స‌ర్వ‌భూపాల వాహ‌న సేవ‌లు
11న మోహినీ అవ‌తారం, గ‌రుడ వాహ‌న‌సేవ‌

12న హ‌నుమంత, గ‌జ వాహ‌న‌సేవ‌లు
13న సూర్య‌ప్ర‌భ, చంద్ర‌ప్ర‌భ వాహ‌న‌సేవ‌లు
14న స‌ర్వ‌భూపాల‌, అశ్వ వాహ‌న‌సేవ‌లు
15న ప‌ల్ల‌కీ ఉత్స‌వం, తిరుచ్చి ఉత్స‌వం
15న రాత్రి ధ్వ‌జావరోహ‌ణ‌ం