కరోనా ఎఫెక్ట్‌: చార్‌ధామ్‌ యాత్ర రద్దు

పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం చార్ ధామ్(బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి)యాత్రను నిలిపివేసింది. దీనిపై ముఖ్యమంత్రి

కరోనా ఎఫెక్ట్‌: చార్‌ధామ్‌ యాత్ర రద్దు

Uttarakhand Govt Suspends Char Dham Yatra In Wake Of Rising Covid Cases

Char Dham yatra:పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం చార్ ధామ్(బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి)యాత్రను నిలిపివేసింది. దీనిపై ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం మే 14 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్న చార్ ధామ్ యాత్రను సస్పెండ్ చేసిందని అన్నారు.

భక్తులు లేకుండానే నాలుగు దేవాలయాల పూజారులు మాత్రమే ఆచారాలు, పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ విషయాన్నీ భక్తులు దృష్టిలో ఉంచుకొని తమ యాత్రను రద్దు చేసుకోవాలని సూచించారు. కరోనాను జయించాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఆయన అన్నారు. కాగా ఉత్తరాఖండ్‌లో కరోనా కోవిడ్‌ మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది.. క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ 1న 2,236 నుండి నిన్నటివరకూ 45,383 కు పెరిగింది.