Hanuman Jayanti : హనుమత్ జయంతి ఎప్పుడు చేసుకోవాలి

చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడు సీతామాతతో

Hanuman Jayanti : హనుమత్ జయంతి ఎప్పుడు చేసుకోవాలి

hanuman jayanti 2022

Hanuman Jayanti :  చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడు సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.

అదేగాక ఇంకో కధనం కూడా ఉంది. చైత్రపూర్ణిమ నాడు ఆంజనేయస్వామి వారు అసురసంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా, హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట.
దీంతో ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం పేరుతో కొన్ని చోట్ల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఉత్తరాదిలో హనుమాన్ జయంతిగా నిర్వహిస్తారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు భక్తులు ఆంజనేయ దీక్ష ధరిస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమన్ జయంతి చేసుకుంటారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున హనుమాన్‌ చాలీసా, హనుమద్దండకం ఇతర శ్లోకాలతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు చెబుతారు.

కొందరు భక్తులు ఈ చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు హనుమాన్ మండల దీక్షను చేపడతారు. కఠిన బ్రహ్మచర్యం మొదలైన నియమాలు పెట్టుకుని, నిత్యం ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. అంత కఠిన నియమాలు పాటించకున్నా, మనం కూడా నిష్ఠగా ఈ మండలం రోజులు రోజూ నిష్ఠగా ఒక్కసారి లేదా 5 సార్లు చాలీసా పారాయణ చేస్తామని సంకల్పం చెప్పుకోవచ్చు.
Also Read : Hanuman Jayanti : ఎంతటి కష్టాన్ని అయినా పోగొట్టే హనుమాన్ లాంగూల స్తోత్రమ్
నిజానికి ఇప్పుడిది అత్యవసరం కూడా. భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి, లోకా సమస్త సుఖినోభవంతు అనేవి సంకల్పాలుగా చేసుకుని, మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుందని పెద్దలు చెపుతారు.