Jammi chettu : దసర పర్వదినాన జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి?

దసర పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువు

Jammi chettu : దసర పర్వదినాన జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి?

Jammi Chettu

Jammi chettu : హిందూ సాంప్రదాయంలో విజయదశమి పర్వదినం రోజున జమ్మిచెట్టును పూజించటం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నారో చాలా మందికి తెలియక పోయినప్పటికీ పూర్వికులు ఆచరిస్తున్న సంప్రదాయాన్ని నేటికి తాము కూడా ఆచరిస్తూ వస్తున్నారు. అయితే దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు అనేదానికి పురాణగాధలు అనేకం ఉన్నాయి. రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారని చెప్తారు. పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే అరణిని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది.

అజ్ఞాతవాసానికి వెళ్ళే సందర్భంలో పాండవులు వారి ఆయుధాలను, వస్త్రాలను జమ్మిచెట్టు తొర్రలో దాచిపెట్టారని, అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆయుధాలను, వస్త్రాలను క్రిందికి దించి శమీవృక్షంగా పిలిచే జమ్మిచెట్టును అపరాజిత దేవి రూపంగా పూజించి ఆశీస్సులు పొంది కౌరవులపై వాటితో విజయం సాధించారట. శ్రీ రాముడు కూడా రావణునిపై యుద్ధం చేసి విజయదశమినాడు విజయం సాధించిన శమీ వృక్షాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

దసర పండుగ రోజు సాయంత్రం జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, శని దోషాలు పోతాయని నమ్ముతారు.

జమ్మి చెట్టు వద్ద పూజను ముగించుకుని ఇళ్ళకు తిరిగి వెళుతూ జమ్మి ఆకులను తీసుకువెళతారు. ఇంట్లోని వారి చేతుల్లో జమ్మి ఆకులను బంగారం అని చెప్పి అందిస్తుంటారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. జమ్మి చెట్టును బంగారంగా చెప్పటానికి అనేక కారణాలు ఉన్నాయి. శమీ వృక్షంగా దీనిని అంతా పిలుస్తారు. ఎందుకంటే జమ్మిచెట్టును సంస్కృతంలో శమీ, శివా, మాంగల్య, లక్ష్మీ, శుభదా, పవిత్ర, సురభి అనే పేర్లతో పిలుస్తారు. జమ్మిచెట్టు ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగిఉంది. జమ్మి ఆకులు, బెరడు, విత్తనాలు, పువ్వులు, అతిసార, గర్భకోశ, కురుపులు, పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఉపకరిస్తాయి.

దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఉందని చెప్తారు. త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. విజయదశమి నాడు ప్రజలచే పూలజందుకుంటున్న మహిమాన్వతిమైన వృక్షంగా జమ్మిచెట్టును చెప్పవచ్చు. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టును నాటమని ప్రోత్సహిస్తోంది.