Yadadri Temple : యాదాద్రిలో క్షేత్రపాలకుడికి ఆకుపూజ

మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు.

Yadadri Temple : యాదాద్రిలో క్షేత్రపాలకుడికి ఆకుపూజ

Yadadri

Yadadri Temple: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయమైన యాదాద్రి పునర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్యాయి. పనులు ఓ వైపు కొనసాగుతున్నా..భక్తులు మాత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. నిత్య పూజలు యదావిధిగా జరుగుతున్నాయి. 2021, అక్టోబర్ 26వ తేదీ మంగళవారం క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి ఆకు పూజను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే ఉన్న విష్ణు పుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయుడు కొలువుదీరిన సంగతి తెలిసిందే.

Read More : Telangana Covid: Corona third wave may come..what the experts are saying

ఆంజనేయుడిని కొలుస్తూ..వేదమంత్ర పఠనం, పంచామృత అభిషేకం, సింధూరంతో ఆలయ అర్చకులు అలంకరించారు. తమలపాకులతో అర్చనలు చేశారు. వివిధ రకాల పూలు, సహస్రనామపఠనం చేశారు. లలితపారాయణం చేసిన అనంతరం..ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. మరోవైపు…యాదాద్రిలో స్వామి వారికి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటలకు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని…నిజాభిషేకం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు కోలహాలంగా సాగాయి. బాలాలయ మండపంలో శ్రీ లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సుదర్శన హోమం, అష్టోత్తరం జరిపించారు. మంగళవారం సాయంత్రం…అలంకార జోడు సేవోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చిన భక్తులకు స్వామి అమ్మవారి ఆశీస్సులు అందచేశారు.