సోనూసూద్ కు చంద్రబాబు ఫోన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తాను తీసుకుంటున్నానని చంద్రబాబు హామీనిచ్చారు. మీ స్పందన అందరికి స్పూర్తిదాయకమన్నారు. ఈ ట్వీట్ కు సోనూ సూద్ స్పందించారు.

కరోనా వేళ..కష్టం అనే మాట వినపడినా..నేనున్నానంటూ..బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందిస్తున్నారు. వలస కార్మికులకు, ఇతరులకు ఆయన సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. వారి వారి స్వగ్రామలకు చేర్చడం, ఆర్థికంగా సాయం చేస్తూ వార్తల్లో నిలిచారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీవ్రంగా నష్టపోయారు.

పొలం దున్నడానికి కాడెద్దులను అద్దెకు తెచ్చుకోలేక…ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా మార్చాల్సి వచ్చింది. కూతుళ్లు నాగలిని లాగుతున్న వీడియో సోషల్ మీడియాను హల్ చల్ చేసింది. ఇది సోనూ సూద్ వరకు చేరింది. దీంతో మరోసారి సోనూ పెద్ద మనస్సు చాటుకున్నారు. వీడియోను చూసి చలించిపోయారు. వెంటనే ఆ కుటుంబానికి

రెండు ఎద్దులు ఇస్తానని చెప్పాడు. కానీ ఆ కుటుంబానికి ఎద్దులు కాదు..ట్రాక్టర్ కావాలని కావాలని పోస్టు చేశాడు. చెప్పినట్లుగానే…2020, జులై 26వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు నాగేశ్వర్ ఇంటికి ట్రాక్టర్ అందించి ఆ కుటుంబానికి భరోసా కల్పించాడు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అందరూ ప్రశంసిస్తున్నారు. సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ..రియల్ హీరో అంటూ కితాబిస్తున్నారు.

Related Posts