చిన్నారి బ్యాటింగ్ స్కిల్స్‌కు వావ్ అంటోన్న షై హోప్, మైకేల్ వాన్

చిన్నారి బ్యాటింగ్ స్కిల్స్‌కు వావ్ అంటోన్న షై హోప్, మైకేల్ వాన్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌లు నోరెళ్లబెడుతున్నారు. వారందరూ తెగ మెచ్చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా.. ఇండియన్ అయిన ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. మంచి ఈజ్‌తో బాల్‌ను కొడుతూ.. చక్కటి ఫూట్ వర్క్‌ను చూపిస్తున్నందుకు ఇంత చిన్న వయస్సులోనే అంత టాలెంట్ అంటూ కామెంట్ పెడుతున్నారు.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్వీట్ చేస్తూ.. ఓ సారి ఈ వీడియో చూడండి. ఏడేళ్ల పరి శర్మ.. మూవ్‌మెంట్స్ చూడండి ఎంత బెస్ట్‌గా ఉన్నాయో’ అని కామెంట్ చేశాడు. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌ అదే వీడియో ట్వీట్ చూస్తూ నేను పెద్దయ్యాక పరి శర్మలా అవ్వాలనుకుంటున్నా’ అని ఫన్నీగా ట్వీట్ చేశాడు.

కామెంట్ సెక్షన్లో ర్యాస్ మోర్గాన్ అనే ట్విట్టర్ యూజర్.. ఇండియన్ ఆల్ రౌండర్ శిఖా పాండేను ట్యాగ్ చేశాడు. నువ్వు ఇలాంటి ప్లేయర్ ను కలవాలని అందులో రాసుకొచ్చాడు. దానికి రిప్లై ఇచ్చిన శిఖా పాండే అవును.. ఆమె నుంచి కొన్ని క్లాసులు నేర్చుకోవాల్సి ఉందని కామెంట్ పెట్టాడు.

 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు పరిశర్మ టెక్నిక్ కు ఫిదా అయిపోతున్నారు. గతేడాది ఓపెనర్ గా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన షెఫాలీ వర్మ.. ఇండియన్ బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ లో హాఫ్ సెంచరీ చేసిన చాలా చిన్న వయస్సు ప్లేయర్ గా ఘనత సాధించింది.