Sachin, Imran Khanలను పక్కకు పెట్టి ఆల్ టైం ఫేవరేట్ టీం చెప్తోన్న Shahid Afridi

  • Published By: Subhan ,Published On : May 8, 2020 / 09:30 AM IST
Sachin, Imran Khanలను పక్కకు పెట్టి ఆల్ టైం ఫేవరేట్ టీం చెప్తోన్న Shahid Afridi

పాకిస్తాన్ యాంకర్ తో కలిసి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఇన్‌‌స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సంభాషణలో భాగంగా లాక్‌డౌన్ సమయంలో డైలీ ప్లాన్ల గురించి చెప్పుకొచ్చాడు. క్రికెట్‌పై Covid-19 ప్రభావాన్ని వివరించాడు. అదే సమయంలో అతని ఫేవరేట్ ఆల్ టైం వరల్డ్ కప్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. 

ఇందులో స్టార్ ప్లేయర్లు అయినటువంటి సచిన్ టెండూల్కర్, ఇమ్రాన్ ఖాన్ లాంటి రికార్డు స్థాయి ప్లేయర్లకు చోటు దక్కలేదు. అంతకంటే ముందు షేన్ వార్న్, ఆకాశ్ చోప్రా, యాష్టన్ అగర్ లు కూడా తమ బెస్ట్ ఎలెవన్ టీం అనౌన్స్ చేశారు. 

అతని జట్టులో ఐదుగురు పాకిస్తాన్ ప్లేయర్లే:
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడం గిల్ క్రిస్ట్, సయ్యద్ అన్వర్ లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ లు తెచ్చిపెట్టి మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన రిక్కీ పాంటింగ్ ను మూడో స్థానంలో తీసుకున్నాడు. 26 మ్యాచ్‌ల్లో 1030 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో తీసుకున్నాడు. మూడు వరల్డ్ కప్ లలో ఆడిన ఇంజమామ్ ఉల్ హక్ కు ఐదో స్థానం కల్పించాడు. 

కేవలం ఒకే ఒక్క ఆల్ రౌండర్ కే స్థానం కల్పించిన అఫ్రిదీ జాక్వెస్ కల్లిస్ ఆరో స్థానం ఇచ్చాడు. బౌలింగ్ యూనిట్ లోనూ అస్సలు కాంప్రమైజ్ కాలేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, గ్లెన్ మెక్ గ్రాత్ లతో పాటుగా స్పిన్నర్లు షేన్ వార్న్, సక్లైన్ ముస్తఖ్ లతో జట్టును సిద్ధం చేశాడు. 

ఆశ్చర్యకరంగా సచిన్ టెండూల్కర్, వఖర్ యూనిస్ లాంటి భారీ రికార్డు హిస్టరీ ఉన్న ప్లేయర్లను ఎంచుకోకపోవడం శోచనీయం. 

Shahid Afridi’s all-time World Cup XI: Saeed Anwar, Adam Gilchrist, Ricky Ponting, Virat Kohli, Inzamam ul-Haq, Jacques Kallis, Wasim Akram, Glenn McGrath, Shane Warne, Shoaib Akhtar, Saqlain Mushtaq

 

More:

*  Rohit భయ్యా.. కూతురు ఏడుస్తుందని వెళ్లిపోయాడు Shami: Chahal

 నాలుగేళ్ల తర్వాత: మ్యాచ్‌లు ఆడకుండా నెం.1 ర్యాంకు పోగొట్టుకున్న టీమిండియా