సున్నాకే ఆలౌట్, 754పరుగుల తేడాతో భారీ పరాజయం

సున్నాకే ఆలౌట్, 754పరుగుల తేడాతో భారీ పరాజయం

సింగిల్ డిజిట్ స్కోరుకు ఆలౌట్ అయిన సందర్భాలు సైతం చాలా అరుదు. అలాంటిది ఒక్క పరుగు కూడా చేయకుండా 754పరుగుల తేడాతో భారీపరాజయాన్ని మూటగట్టుకుంది ఓ జట్టు. ఈ ఘటన ముంబైలోని అంండర్-16టోర్నమెంట్ లో జరిగింది.  జట్టు మొత్తం డకౌట్లుగా వెనుదిరగడంతో ప్రత్యర్థి జట్టు ఇచ్చిన ఎక్స్‌ట్రా బంతులే స్కోర్‌ను తెచ్చిపెట్టాయి. 

స్వామి వివేకానంద్ స్కూల్(ఎస్వీఐఎస్)కు చిల్డ్రన్స్ వెల్ఫేర్ సెంటర్ స్కూల్ జట్లకు మధ్య మ్యాచ్ జరిగింది. అందేరీలోని గ్రామీణ ప్రాంతంలో జరిగిన మ్యాచ్‌లో స్వామి వివేకానంద జట్టు 45ఓవర్లు పూర్తయ్యేసరికి 4వికెట్లు నష్టపోయి 761పరుగులు చేయగలిగింది. మీట్ మయేకర్ తానొక్కడే 134బంతుల్లో 338(56ఫోర్లు, 7సిక్సులు) పరుగులు పూర్తి చేశాడు. 

చిల్డ్రన్ వెల్ఫేర్ స్కూల్ టీంపై ఒత్తిడి పెంచడంతో ఒక్క వ్యక్తిగత పరుగు కూడా చేయలేకపోయారు. హ్యారీస్ షీల్డ్ మైదానంలో జరిగిన 126ఏళ్ల చరిత్రను తిరగరాసింది ఈ మ్యాచ్. భారత మాజీ క్రికెటర్లు, రంజీ ప్లేయర్లకు ఇదే టోర్నమెంట్‌లో ఆడి బాగా రాణించారు.