Sri Lanka – India : భారత్ భారీ స్కోరు .. జడేజా సెంచరీ

భారత్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యింది. ఈ సెషన్ పూర్తయ్యే సరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది...

Sri Lanka – India : భారత్ భారీ స్కోరు .. జడేజా సెంచరీ

India And Srilanka

Mohali Sri Lanka Tour Of India : భారత్ – శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యింది. ఈ సెషన్ పూర్తయ్యే సరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా సెంచరీతో (102) కదం తొక్కాడు. రిషబ్ పంత్ (96) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. హనుమ విహారి 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తాను కూడా తక్కువ తినలేదంటూ.. రవీంచంద్రన్ అశ్విన్ కూడా చెలరేగిపోయాడు. అర్ధ సెంచరీ (61)తో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్డెనియా, సురంగ లక్మల్ చెరో రెండు, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, ధనంజయ డి సిల్లా, చరిత్ అసలంక తలో ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read More : విరాట్‌ కోహ్లీ @ 8000.. టెస్టుల్లో అరుదైన మైలురాయి

మొదటి రోజు ఆటలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. తొలి సెషన్ ఆటను రవీచంద్రన్ అశ్విన్ (56)తో రవీంద్ర జడేజాలు ఆటను ప్రారంభించారు. వీరిద్దరూ పరుగులు తీస్తూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించారు. 97 ఓవర్ లో జట్టు స్కోరు నాలుగొందలు దాటింది. వికెట్ పోకుండా వీరిద్దరూ జాగ్రత్తగా ఆడారు. 106 ఓవర్ లో అశ్విన్ హాఫ్ సెంచరీ చేశాడు. వెంటనే సురంగ లక్మల్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం 111 ఓవర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న జడేజా (103) సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 7 వికెట్లు కోల్పోయి 470 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా 103, జయంత్ యాదవ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Read More : India vs Sri Lanka: ఇప్పటి వరకు భారత్‌లో గెలవని శ్రీలంక జట్టు.. హెడ్ టూ హెడ్ రికార్డ్ ఇదే!

భారత్ బ్యాటింగ్ : మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29), హనుమ విహారి (58), విరాట్ కోహ్లీ (45), రిషబ్ పంత్ (96), శ్రేయాస్ (27), రవిచంద్ర అశ్విన్ (61).