2022 Commonwealth Games : 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ రీఎంట్రీ.. ఈసారి మహిళా క్రికెట్‌కు అవకాశం

2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్‌లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్‌వెల్త్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది.

2022 Commonwealth Games : 24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ క్రీడల్లోకి క్రికెట్‌ రీఎంట్రీ.. ఈసారి మహిళా క్రికెట్‌కు అవకాశం

2022 Commonwealth Games Cr

2022 Commonwealth Games : 2022 బర్మింగ్ హోమ్ ఎడిషన్‌లోకి క్రికెట్ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. 24ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు కామన్‌వెల్త్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. 2022 జూన్ లో బర్మింగ్ హోమ్ (ఇంగ్లండ్) వేదికగా (2022 Commonwealth Games) 22వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ క్రీడల్లో క్రికిట్ కు ప్రాతినిద్యం లభించింది. ఈసారి మాత్రం మహిళల క్రికెట్ కు మాత్రమే చోటు దక్కింది. ఈ మేరకు కామన్‌వెల్త్‌ క్రీడల సమాఖ్య(CGF) అనుమతినిచ్చింది.

T20 ఫార్మాట్లో లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో క్రికెట్ గేమ్ కొనసాగనుంది. ఇందులో మొత్తం 8 జట్లు(భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, బార్బడోస్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకి​స్థాన్‌) పాల్గొనేందుకు ఐసీసీ (ICC) అనుమతినిచ్చింది. మహిళల T20 టోర్నమెంట్‌లో శ్రీలంక ఎనిమిదో జట్టుగా ధ్రువీకరించింది.

గత వారం కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫైయర్‌లో శ్రీలంక విజయం సాధించింది. దాంతో కామన్ వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక ప్రవేశానికి CGF ఆమోదం లభించింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి. కామన్ వెల్త్ గేమ్స్ లోఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ తొలిసారిగా ప్రవేశించింది. కామన్ వెల్త్ క్రీడల్లో జూలై 29న భారత్, ఆస్ట్రేలియా ఓపెనింగ్ గేమ్‌తో ప్రారంభం కానుంది.

ఆగస్ట్‌ 7న జరిగే గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌తో కామన్ వెల్త్ గేమ్స్ ముగియనున్నాయి. ICC, CGF సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రకటించాయి. 1998లో మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ క్రీడల్లో పురుషుల జట్టుకు మాత్రమే చోటు లభించింది. అది కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌ లోనే క్రికెట్ ప్రాతినిధ్యం లభించింది. అప్పట్లో షాన్‌ పొలాక్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా పురుషుల జట్టు.. స్టీవ్‌‌వా సారథ్యంలోని ఆస్ట్రేలియాపై జట్టుపై గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ICC హాల్ ఆఫ్ ఫేమర్స్ భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే 1998 గేమ్స్‌లో పాల్గొన్న అనేక మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు.

గ్రూప్ Aలో ఆస్ట్రేలియా, భారత్‌తో పాటు బార్బడోస్, పాకిస్తాన్ ఉండగా… గ్రూప్ Bలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా శ్రీలంక జట్లు ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక అర్హత సాధించినందుకు శ్రీలంకను ICC, CGF అభినందించాయి. 72 దేశాలకు చెందిన 4500 అథ్లెట్లు, జూలై 28 నుంచి ఆగస్ట్‌ 8 వరకు జరిగే కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొననున్నారు. భారత్ సహా పలు దేశాల క్రికెట్ జట్లు టోర్నమెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Read Also : COVID Positive : కోవిడ్ వచ్చినా.. ఐసోలేషన్ అవసరం లేదు