India Vs South Africa : ధాటిగా ఆడుతున్న దక్షిణాఫ్రికా 111/1

ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ధాటిగానే ఆడుతోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి...

India Vs South Africa : ధాటిగా ఆడుతున్న దక్షిణాఫ్రికా 111/1

Icc Womens South Africa

ICC Women’s World Cup : ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ధాటిగానే ఆడుతోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత టాస్ గెలిచిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ఓపెనర్లు Lizelle Lee, Laura Wolvaardt ఆటను ఆరంభించారు. అయితే Lizelle Lee కేవలం ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యారు. Laura Wolvaardt, Lara Goodall వీరిద్దరూ భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. బంతులను వేస్ట్ చేయకుండా పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. కేవలం 53 బంతులను ఎదుర్కొన్న Laura Wolvaardt 52 పరుగులు చేశారు. ఈమెకు Lara Goodall చక్కటి సహకారం అందించారు. వీరిద్దరినీ విడదీయడానికి భారత మహిళా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ వీరు గోడలాగా నిలబడి పోవడంతో వికెట్ దక్కలేదు. 20 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా మహిళా టీం 111 పరుగులు సాధించింది.

Read More : India Vs South Africa : దక్షిణాఫ్రికా టార్గెట్ 275 రన్లు, రాణించిన మంధాన, చివరిలో చెలరేగిన హర్మన్

అంతకుముందు టాస్ గెలిచిన మిథాలీ సేన టీం.. అదరగొట్టింది. అందరూ కలిసికట్టుగా ఆడడంతో భారత్ 274 పరుగులు సాధించింది. స్మృతి మంధాన 71, కెప్టెన్ మిథాలీ రాజ్ 68, షఫాలీ వర్మ 53 ధాటిగా ఆడారు. చివరిలో వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ చెలరేగిపోయారు. 57 బంతులను ఎదుర్కొన్న హర్మన్ 48 పరుగులు చేసింది. మిగతా మహిళా క్రీడాకారిణిలు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన మిథాలీ సేన 274 పరుగులు చేయగలిగింది.