Bangladesh vs India: 8వ స్థానంలో దిగి సెంచరీ బాదిన మెహిదీ హసన్.. టీమిండియా లక్ష్యం 272

ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ క్రీజులో నిలదొక్కుకుని 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. అలాగే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్ముదుల్లా 77 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 271/7 పరుగులు చేసింది.

Bangladesh vs India: 8వ స్థానంలో దిగి సెంచరీ బాదిన మెహిదీ హసన్.. టీమిండియా లక్ష్యం 272

Bangladesh vs India

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచులో బంగ్లా ఆల్ రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ 83 బంతుల్లో 100 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రాణించకపోవడంతో ఒక దశలో బంగ్లాదేశ్ స్కోరు కనీసం 200 దాటదని అంతా భావించారు.

అయితే, ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ క్రీజులో నిలదొక్కుకుని 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. అలాగే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్ముదుల్లా 77 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ లో అనముల్ హక్ 11, లిట్టొన్ దాస్ 7, నజ్ముల్ షాంటో 21, షకీబ్ హాసన్ 8, రహీం 12, మహ్ముదుల్లా 77, అఫిఫ్ హొస్సైన్ 0, మెహిదీ హసన్ 100 (నాటౌట్), నాసం అహ్మద్ 18(నాటౌట్) పరుగులు చేశారు.

దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 271/7 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు.

272 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది టీమిండియా. క్రీజులోకి విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ వచ్చారు. గాయం కారణంగా రోహిత్ శర్మ మ్యాచు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా తొలి మ్యాచు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగే మ్యాచులోనూ ఓడిపోతే సిరీస్ కోల్పోతుంది. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నూ టీమిండియా కోల్పోయింది.

Adorable Video: కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. అలరిస్తున్న వీడియో