MK Stalin : టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే రూ.3 కోట్ల ప్రైజ్ మనీ

త్వరలో టోక్యో ఒలంపిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..తమ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం బంపర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

MK Stalin : టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తే రూ.3 కోట్ల ప్రైజ్ మనీ

Mk Stalin (1)

MK Stalin త్వరలో టోక్యో ఒలంపిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..తమ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం బంపర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన అథ్లెట్లు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. అదేవిధంగా, రజత పతక విజేతలకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 కోటి అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రం నుంచి టోకియో ఒలింపిక్స్‌కు వెళ్తున్న క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని స్టాలిన్ ఆకాంక్షించారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నామని స్టాలిన్ తెలిపారు.

కాగా,2012లో చెన్నైకి చెందిన గగన్ నారంగ్.. లండన్ ఒలంపిక్స్ లో మెన్స్ 10m ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ తరపున పాల్గొని కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏకైక వ్యక్తిగత పతక విజేతగా ఆయనే ఉన్నారు.

ఇటీవల హర్యానా ప్రభుత్వం కూడా..టోక్యో ఒలంపిక్స్ లో తమ రాష్ట్రం నుంచి బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే..వారికి రూ. 4 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ. 2.50 కోట్ల నగదు బహుమతి అందచేయనున్నట్లు ప్రకటించింది. ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి నగదు పురస్కారం అందచేయడం జరుగుతుందని, రాష్ట్రానికి చెందిన 30 మంది క్రీడాకారులకు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహాలు అందచేయడం జరిగిందని గత బుధవారం హర్యానా సీఎం ఖట్టర్ తెలిపారు. కాగా, జపాన్ లో టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి. వాస్తవానికి టోక్యో ఒలంపిక్స్ గతేడాదే జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.