Ryan Burl : వావ్.. ఒకే ఓవర్‌లో 6,6,6,6,4,6.. సెన్సేషనల్ బ్యాటింగ్

జింబాబ్వే క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.

Ryan Burl : వావ్.. ఒకే ఓవర్‌లో 6,6,6,6,4,6.. సెన్సేషనల్ బ్యాటింగ్

Ryan Burl : జింబాబ్వే క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఒక ఫోర్ బాదాడు. బంగ్లాదేశ్ తో 3వ టీ20 మ్యాచ్ లో ర్యాన్ బర్ల్ ఈ ఘనత సాధించాడు. స్పిన్నర్ నసుమ్ అహ్మద్ వేసిన 15వ ఓవర్ లో వరుసగా.. 6,6,6,6,4,6 కొట్టాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో జింబాబ్వే 2-1 తేడాతో బంగ్లాదేశ్ పై గెలిచి సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది.

బంగ్లా స్పిన్నర్‌ నసుమ్‌ అహ్మద్‌ వేసిన 15వ ఓవర్‌లో బర్ల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలిచిన ర్యాన్‌.. ఆ తర్వాతి బంతికి ఫోర్‌ కొట్టాడు. తర్వాతి బంతికి ఏమవుతుందా అని ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఆరో బంతిని సైతం ప్రేక్షకుల మధ్యలోకి పంపాడు. దీంతో ఒకే ఓవర్‌లో 34 పరుగులు సాధించి అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అంతకంటే ముందు భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతులకు ఆరు సిక్సులు బాదిన విషయం తెలిసిందే. ఆపై విండీస్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ సైతం శ్రీలంక బౌలర్‌ అకిల ధనంజయపై విరుచుకుపడి 36 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సైఫర్ట్‌, భారత యువ ఆటగాడు శివమ్‌ దూబే 34 పరుగులు సాధించగా.. తాజాగా ర్యాన్‌ బర్ల్‌ ఆ జాబితాలో చేరాడు.

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను జింబాబ్వే 2-1తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో చెరో జట్టు గెలుపొందగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో జింబాబ్వే 10 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన బర్ల్‌ హాఫ్ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. బర్ల్ 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. న్యూచీ 20 బంతుల్లో 35 పరుగులతో విజృంభించడంతో జట్టు స్కోరు 156కు చేరింది. 157 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 146 పరుగులకే పరిమితమైంది.