వైరల్ వీడియో: బంతిని కాలితో తన్ని, చేతితో ఆపి, అవుట్ అయ్యాడు.. నవ్వించాడు

  • Published By: vamsi ,Published On : November 9, 2020 / 09:29 AM IST
వైరల్ వీడియో: బంతిని కాలితో తన్ని, చేతితో ఆపి, అవుట్ అయ్యాడు.. నవ్వించాడు

A rare form of dismissal: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడానికి సాధారణంగా చాలా మార్గాలు ఉన్నాయి. బౌల్డ్, క్యాచ్, ఎల్‌బిడబ్ల్యు, హిట్ వికెట్ ఇలా.. చాలా. అయితే మాంకడింగ్ అవుట్, ఫీల్డ్ అవుట్ మాత్రం కాస్త అరుదుగా క్రికెట్‌లో కనిపిస్తుంది. స్టంప్‌ పడకుండా, ఏ విధంగానైనా ఫీల్డింగ్ చేయకుండా ఉండి బంతిని బ్యాట్స్‌మెన్ చేతితో ఆపడానికి ప్రయత్నిస్తే ఇలా అవుట్ చేయవచ్చు. చేతితో బౌలింగ్ చేసిన బంతిని పట్టుకోవడాన్ని హ్యాండ్లింగ్ ది బాల్ అని పిలుస్తారు. కానీ 2017 సంవత్సరంలో నియమం మార్చగా.. దానిని అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అవుట్ అని పిలుస్తున్నారు.



ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 63 సార్లు బ్యాట్స్ మాన్ బంతిని హ్యాండిల్ చేసి అవుట్ అయ్యారు. లెజండరీ బ్యాట్స్ మెన్ అయిన స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, గ్రాహం గూచ్ కూడా ఈ పద్ధతిలో అవుట్ అయ్యారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో వా ఇలాగే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో, ఒక బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ విధంగా అవుట్ అయ్యాడు. 1953 లో, కాంటర్బరీకి చెందిన జానీ హేస్ అలా అవుట్ అయ్యాడు.



https://10tv.in/new-low-pressure-bay-bengal-likely-to-form-around-october-29-imd/
అయితే ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెటర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన 30 ఏళ్ల బ్లుండెల్.. ఆసక్తికరమైన రీతిలో అవుట్ అయ్యాడు. అతను అవుట్ అయిన విధానం ఆశ్చర్యపరచడమే కాకుండా.. చాలా మందిని నవ్వించింది. కానీ బ్లుండెల్ అవుట్ అవడం కూడా అతనికి ఓ రికార్డుగా మారింది. న్యూజిలాండ్ దేశీయ క్రికెట్లో, బ్లుండెల్ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ ఇవ్వబడింది. మూడేళ్ల క్రితం బంతి నిబంధనను సవరించిన తరువాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇలా అవుట్ అయిన తొలి బ్యాట్స్‌మన్ అతడు.



వెల్లింగ్టన్ మరియు ఒటాగో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. బ్లుండెల్ వెల్లింగ్టన్ కోసం ఆడుతున్నాడు. బంతిని బ్యాట్‌తో కొట్టిన తరువాత, బంతి క్రీజ్‌లోనే బౌన్స్ అయ్యింది మరియు స్టంప్స్‌పై పడే ప్రమాదం వచ్చింది. అవుటయ్యే ప్రమాదం చూసిన బ్లుండెల్ బంతిని కుడి కాలుతో కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. అప్పుడు చేతితో ఆపాడు. దీంతో ఒటాగో టీమ్ అంపైర్‌ను తొలగించాలని అప్పీల్ చెయ్యగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. బ్లుండెల్ 101 పరుగులకు అవుట్ అయ్యాడు. ప్లంకెట్‌ షీల్డ్‌ 2020-21 సీజన్‌లో భాగంగా వెల్టింగ్టన్‌-ఒటాగో జట్ల మధ్య జరిగిన న్యూజిలాండ్‌ దేశవాళీ మ్యాచ్‌లో 147 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు చేసి బ్లుండెల్ అవుట్ అయ్యాడు.



2015లో మిచెల్‌ స్టార్క్‌ వేసిన బంతిని బెన్‌స్టోక్స్‌ ఇలాగే ఆపి అవుట్ అవగా.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో ఈ తరహా అవుట్ ఒకసారే జరిగింది. వన్డే ఇంటర్నేషనల్స్‌‌లో 7సార్లు, టీ20ల్లో రెండుసార్లు ఇటువంటి పరిణామం చోటుచేసుకుంది.