T20 లీగ్ నుంచి తప్పుకుంటున్న డివిలియర్స్

T20 లీగ్ నుంచి తప్పుకుంటున్న డివిలియర్స్

దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్.. మిస్టర్ 360 AB De Villiers ఆ టీ20 లీగ్ నుంచి తప్పుకుంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నడివిలియర్స్ ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్ లో ఆడేందుకు నో చెప్పాడు. బిగ్ బాష్ లీగ్ జరిగే సమయానికి తనకు మూడో సంతానం వస్తుందనే డేట్ తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘ఇది గ్రేట్ ఫీలింగ్ అనుకుంటున్నా. త్వరలోనే బిగ్ బాష్ క్లబ్ లో తిరిగి జాయిన్ అవుతా. టీంలో ఆడలేకపోవడాన్ని మధ్యలోనే ఆపేసినట్లు భావిస్తున్నా’ అని డివిలియర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బిగ్ బాష్ లీగ్ లో ఆడుతున్న 8జట్లలో డివిలియర్స్.. బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.




https://10tv.in/ipl-2020-playoffs-qualification-scenario-what-do-csk-kxip-rr-srh-need-to-finish-in-top-4/
త్వరలోనే మాకు మరో బేబీ రాబోతుంది. కొవిడ్-19 రీత్యా ఆ సమయంలో ప్రయాణాలు ఉండకూడదని అనుకుంటున్నా. అందుకే ఈ సీజన్ కు దూరం అవుతున్నా’ అని చెప్పాడు. డివిలియర్స్ ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ కీలకంగా మారాడు.