Afghanistan : పాక్‌లో అప్ఘాన్ మహిళల ఫుట్ బాల్ జట్టు

అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంక్షలు, నిబంధనల మధ్య ప్రజలు బతుకుతున్నారు.

Afghanistan : పాక్‌లో అప్ఘాన్ మహిళల ఫుట్ బాల్ జట్టు

Football

Women’s Football Team : అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు రెచ్చిపోతున్నారు. వ్యతిరేకించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంక్షలు, నిబంధనల మధ్య ప్రజలు బతుకుతున్నారు. మహిళలే టార్గెట్ చేస్తూ..తాలిబన్లు రెచ్చిపోతున్నారు. క్రీడలపై కూడా పలు నిబంధనలు జారీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

Read More : ChinnaJeeyar : కేంద్రమంత్రులతో చిన్నజీయర్ భేటీ.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని వినతి

కానీ..కాబూల్ ఎయిర్ పోర్టు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో..సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉంటే..మహిళల ఫుట్ బాల్ టీం…పాక్ కు సురక్షితంగా చేరుకుంది. తాలిబన్ల నుంచి మహిళా ఫుట్ బాలర్లకు ముప్పు ఉండడంతో 32 మంది కుటుంబసభ్యులతో పొరుగుదేశమైన పాక్ లో అడుగుపెట్టారు. వాస్తవానికి ఈ జట్టు ఖతార్ కు బయలుదేరాల్సి ఉంది. కాబూల్ అంతర్జాతీయ విమానశ్రాయం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో…అక్కడకు వెళ్లే వీలు కాలేకపోయింది. దీంతో తాలిబన్ల కళ్లు గప్పి పాక్ కు చేరుకుంది.

Read More : DRDO : రహస్య సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసిన డీఆర్డీఓ ఉద్యోగులు

పురుషుల క్రీడలకు తాలిబన్లు ఓకే చెప్పినా…మహిళలు షరియా చట్టల ప్రకారం ఆటలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు తాలిబన్లు. దీనిపై మహిళా ఫుట్ బాలర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. వారిని తాలిబన్లు నిర్భించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో..బ్రిటన్ కు చెందిన ఎన్జీవో సహకారంతో ఫుట్ బాలర్లకు పాక్ అత్యవసర వీసాలు జారీ చేసింది. పాక్ లో దిగిన వీరికి పెషావర్ లేదా లాహోర్ లో బస ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.