Shahid Afridi: పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా అఫ్రిది నియామకం.. ప్యానల్‌లో మరికొందరు మాజీలు ..

పాకిస్థాన్ పురుషుల జట్టు జాతీయ సెలక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్‌గా నియమాకంపై షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ ఈ బాధ్యతను అప్పగించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నా సామర్థ్యానికి తగినట్లుగా ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ఎటువంటి వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు.

Shahid Afridi: పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా అఫ్రిది నియామకం.. ప్యానల్‌లో మరికొందరు మాజీలు ..

Shahid Afridi

Shahid Afridi: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ పరుషుల జట్టు జాతీయ సెలక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్‌గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని నియమించింది. అఫ్రిదితో పాటు అబ్దుల్ రజాక్, రావు ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్‌లను ప్యానల్ సభ్యులుగా నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. అయితే వీరు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఈ నెలలో జరిగే సిరీస్ కోసం సెలక్షన్ కమిటీలో పనిచేస్తారు.

Shahid Afridi: షమీ ‘కర్మ’ ట్వీట్‌పై స్పందించిన షాహిద్ అఫ్రిది.. ఇద్దరు క్రికెటర్లకు హింతబోధ చేశాడు..

తాత్కాలిక చైర్మన్ గా నియమాకంపై షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. పీసీబీ మేనేజ్ మెంట్ కమిటీ ఈ బాధ్యతను అప్పగించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. నా సామర్థ్యానికి తగినట్లుగా ఈ బాధ్యతను నిర్వర్తించడంలో ఎటువంటి వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో పాక్ జట్టు రాణించి అభిమానుల మెప్పుపొందేందుకు మేము సహాయపడతామని నమ్మకం ఉందని అన్నారు.

Pakistan Cricket Board: పీసీబీ చైర్మన్‌గా రమీజ్ రాజా తొలగింపుకు కారణమదేనా?

షాహిద్ అఫ్రిది, ప్యానెల్ సభ్యులుగా మాజీ క్రికెట్లను నియమించడం పట్ల పీసీబీ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ నజామ్ సేథి స్పందించారు.. అఫ్రిది 20ఏళ్లు క్రికెట్ అనుభవం ఉన్న వ్యక్తి. అతని అటాకింగ్ క్రికెట్‌కు తోడు వేగంగా, నాణ్యమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యాలు పుష్కలంగా కలిగిఉన్నాడు. దీంతో.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థంచేసుకొని జట్టును అభివృద్ధి పథంలో నడిపించడంలో అఫ్రిది, ఆయన ప్యానల్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను అని నజామ్ సేథి తెలిపాడు.