Team India New Jersey: టీమ్ఇండియా కొత్త జెర్సీల‌ను చూశారా..? ఆవిష్క‌ర‌ణ వీడియో వైర‌ల్‌

ఐపీఎల్ ముగియ‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి డబ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ పై ప‌డింది. కాగా.. టీమ్ఇండియా కొత్త జెర్సీతో ఈ మ్యాచ్ ఆడ‌నుంది. టీమ్ఇండియాకు కిట్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అడిడాస్ సంస్థ‌నే జెర్సీ స్పాన్స‌ర్‌గా మారింది

Team India New Jersey: టీమ్ఇండియా కొత్త జెర్సీల‌ను చూశారా..? ఆవిష్క‌ర‌ణ వీడియో వైర‌ల్‌

Adidas has launched a new Indian cricket jersey

Team India: ఐపీఎల్ ముగియ‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి డబ్ల్యూటీసీ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్ పై ప‌డింది. కాగా.. టీమ్ఇండియా కొత్త జెర్సీ(Team India New Jersey)తో ఈ మ్యాచ్ ఆడ‌నుంది. టీమ్ఇండియాకు కిట్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అడిడాస్(Adidas) సంస్థ‌నే జెర్సీ స్పాన్స‌ర్‌గా మారింది. దీంతో మూడు ఫార్మాట్లు(టెస్టులు, వ‌న్డేలు, టీ20ల‌కు) సంబంధించిన జెర్సీల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)), అడిడాస్‌లు ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. ఈ ఒప్పందం 5 సంవ‌త్స‌రాలు ఉండ‌నుంది. దీని విలువ దాదాపు రూ.350 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. పురుషుల, మహిళలు, యువ జట్లతో సహా బీసీసీఐకి సంబంధించిన అన్ని మ్యాచ్‌లు, శిక్షణలు, ప్రయాణ దుస్తులకు అడిడాస్ ఏకైక సరఫరాదారుగా ఉంటుంది.

MS Dhoni: శుభ‌వార్త‌.. ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్‌

“మేము క్రికెట్ ఆటను అభివృద్ధి చేయడంలో సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ ప్రయాణంలో ప్రపంచంలోని ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్‌లలో ఒకటైన అడిడాస్‌తో ఒప్పందం చేసుకున్నాం. క్రీడలలో దాని గొప్ప చారిత్రక వారసత్వం, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మరియు బలమైన ప్రపంచ రీచ్, భారత క్రికెట్‌లోని వివిధ వర్గాల ప్రదర్శన మరియు భవిష్యత్తు విజయాన్ని సాధించడంలో అడిడాస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది” అని బిసిసిఐ కార్యదర్శి జయ్ షా ఒక ప్రకటనలో తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by adidas India (@adidasindia)

WTC Final 2023: అజింక్యా ర‌హానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?

‘BCCI, టీమ్ ఇండియాతో భాగస్వామి అయినందుకు మేము గర్విస్తున్నాము. భారతదేశంలో క్రికెట్ అత్యంత ముఖ్యమైన క్రీడ. బీసీసీఐ కంటే మెరుగైన భాగస్వామి మాకు దొరకదు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా మార్కెట్‌గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో అత్యుత్తమ స్పోర్ట్స్ బ్రాండ్‌గా మారడానికి మా జట్టుకు మద్దతు ఇవ్వడానికి మేము చాలా కట్టుబడి ఉన్నాము.’ అని అడిడాస్ CEO జార్న్ గుల్డెన్ అన్నారు.