IPL 2023: ఫైనల్ మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడడంపై మీమ్స్.. ఇక మెట్రో ట్రైన్లోనైతే…

ఏదో జరుగుతుందని స్టేడియానికి వెళ్తే మరేదో జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.

IPL 2023: ఫైనల్ మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడడంపై మీమ్స్.. ఇక మెట్రో ట్రైన్లోనైతే…

IPL 2023 Final Match memes

IPL 2023 – Final Match: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగకుండా వరుణుడు అడ్డుపడడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే, మ్యాచ్ వాయిదా పడ్డప్పటికీ విజేతగా ధోనీ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ నిలుస్తుందని ఆ జట్టు అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

చివరకు ఫైనల్ మ్యాచ్ వరుణుడే గెలిచేట్టు ఉన్నాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏదో జరుగుతుందని స్టేడియానికి వెళ్తే మరేదో జరిగిందని అంటున్నారు. స్టేడియంలో కొందరు పోలీసులతో గొడవ పడ్డారు. అహ్మదాబాద్ మెట్రో ట్రైన్ లో ధోనీకి అనుకూలంగా అభిమానులు నినాదాలు చేశారు.

ఒకవేళ ధోనీ జట్టు కప్ గెలవకపోయినా అతడు తమ గుండెల్లో ఉంటాడని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పరిసరాల్లో వాననీటిలో తడిసి ముద్దయిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

IPL2023 Final:మ్యాచ్ వాయిదా.. అభిమానుల అగ‌చాట్లు.. ధోనిని చూసేందుకు రైల్వే స్టేష‌న్‌లోనే ప‌డుకున్న చెన్నై ఫ్యాన్స్‌