Ind Vs WI : భారత్‌ను ఆదుకున్న అయ్యర్, పంత్ జోడీ

అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను..

Ind Vs WI : భారత్‌ను ఆదుకున్న అయ్యర్, పంత్ జోడీ

Iyer And Rishabh Pant

Ind Vs WI : అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను… అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరు కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయ్యర్ 74 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వన్డేల్లో అయ్యర్‌కిది తొమ్మిదో హాఫ్‌ సెంచరీ. ధాటిగా ఆడిన యువ వికెట్ కీపర్ పంత్ 47 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. వన్డేల్లో పంత్‌కిది ఐదో అర్ధ శతకం. కాగా, హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే పంత్ ఔటయ్యాడు.

WHO Warn Covid : కరోనా ఇంకా పోలేదు.. మరిన్ని వేరియంట్లు ఏ క్షణమైనా విజృంభించొచ్చు… WHO సైంటిస్ట్ హెచ్చరిక..!

56 పరుగులు చేసిన పంత్… హేడెన్ వాల్ష్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. 6 పరుగులు చేసిన యాదవ్.. అలెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 80 పరుగుల దగ్గర శ్రేయస్ అయ్యర్ కూడా ఔటయ్యాడు.

Reliance Jio New Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు మారాయి.. చెక్ చేసుకోండి..!

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 10 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.

ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్.. మూడో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ వైట్‌వాష్‌ చేయాలని చూస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి ఘోర అవమానాన్ని తప్పించుకోవాలని విండీస్ చూస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్‌ రాహుల్‌, యుజ్వేంద్ర చాహల్‌, దీపక్‌ హుడా స్థానాల్లో శిఖర్‌ ధావన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చారు.