Ajinkya Rahane: రూట్ మార్చిన ర‌హానే.. టెస్టుల‌ను కూడా టీ20లాగే..!

ఇప్పుడు అంద‌రి దృష్టి టీమ్ఇండియా సీనియ‌ర్ ఆటగాడు అయిన అజింక్యా రహానే(Ajinkya Rahane) పైనే ఉంది. ఫైన‌ల్ మ్యాచ్‌లో అత‌డు ఎలా రాణిస్తాడు అన్న‌దానిపైనే అత‌డి కెరీర్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.

Ajinkya Rahane: రూట్ మార్చిన ర‌హానే.. టెస్టుల‌ను కూడా టీ20లాగే..!

Ajinkya Rahane

Ajinkya Rahane-WTC Final: క్రికెట్ ప్రేమికులు ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(WTC Final 2023) మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో భార‌త్‌(Team India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్పుడు అంద‌రి దృష్టి టీమ్ఇండియా సీనియ‌ర్ ఆటగాడు అయిన అజింక్యా రహానే(Ajinkya Rahane) పైనే ఉంది. ఫైన‌ల్ మ్యాచ్‌లో అత‌డు ఎలా రాణిస్తాడు అన్న‌దానిపైనే అత‌డి కెరీర్ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.

ర‌హానే.. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో చోటు కోల్పోయి చాలా కాల‌మే అయ్యింది. కేవ‌లం టెస్టుల్లో మాత్ర‌మే టీమ్ఇండియా త‌రుపున ఆడుతున్నాడు. అయితే పేల‌వ ఫామ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ టీమ్‌లో చోటు ద‌క్క‌డం లేదు. ఇటీవ‌ల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున అద్భుతంగా రాణించడంతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ట్టులో చోటు ల‌భించింది. దాదాపు 18 నెల‌ల త‌రువాత అత‌డు టీమ్ఇండియా జెర్సీ ధ‌రించ‌నున్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించ‌కుంటే దాదాపుగా అత‌డి కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నాడు.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు ముందు ఆస్ట్రేలియాను భ‌య‌పెడుతున్న చెత్త రికార్డు

ప్ర‌స్తుతం ర‌హానే లండ‌న్‌లో టీమ్‌తో క‌లిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గ‌తం గురించి తాను ఎక్కువ‌గా ఆలోచించ‌డం లేద‌న్నాడు. మంచో, చెడో జ‌రిగిపోయిందని, ఇప్పుడు మ‌ళ్లీ కొత్త‌గా ఆరంభించాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. 18-19 నెలల త‌రువాత జ‌ట్టులోకి రావ‌డం ఆనందాన్ని ఇస్తోందన్నాడు. సీఎస్‌కే త‌రుపున ఐపీఎల్‌లో ఆడ‌టాన్ని బాగా ఆస్వాదించాను. ఐపీఎల్‌, రంజీ ట్రోఫీలో ఎలా ఆడానో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌లోనూ అలాగే ఆడాలని భావిస్తున్న‌ట్లు ర‌హానే తెలిపాడు.

ప్ర‌స్తుతం తాను ఫార్మాట్ గురించి అతిగా ఆలోచించ‌డం లేద‌ని చెప్పాడు. స‌హ‌జ‌శైలిలో బ్యాటింగ్ చేస్తాన‌న్నాడు. ఇక తాను జ‌ట్టులో స్థానం కోల్పోయిన‌ప్పుడు కుటుంబం, స్నేహితులు ఎంతో మ‌ద్ద‌తుగా నిలిచార‌ని చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్‌ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డ‌ట్లు వివ‌రించాడు. తిరిగి టీమ్ఇండియా త‌రుపున ఆడాల‌న్న ల‌క్ష్యంతోనే దేశ‌వాలీ క్రికెట్‌లో ఆడిన‌ట్లు ర‌హానే వెల్ల‌డించాడు.

WTC Final 2023: అజింక్యా ర‌హానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?

చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్‌లో ఐదో సారి టైటిల్ గెల‌వ‌డంలో ర‌హానే కూడా కీల‌క పాత్ర పోషించాడు. 14 మ్యాచుల్లో 326 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 71. టీమ్ఇండియా త‌రుపున ర‌హానే ఇప్ప‌టి వ‌ర‌కు 82 టెస్టులు, 90 వ‌న్డేలు, 20 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 4,931 ప‌రుగులు, వ‌న్డేల్లో 2,962 ప‌రుగులు, టీ20ల్లో 375 ప‌రుగులు చేశాడు.