Andre Russel: బీపీఎల్ మ్యాచ్ లో విచిత్రంగా ఔటైన ఆండ్రే రస్సెల్

వికెట్లు ఎదురెదురుగా ఉన్నపుడు బంతిని విసిరితే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం సాధారణం, కానీ పక్కనుంచి వచ్చిన బంతి ఒకేసారి స్ట్రైకర్, నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకడం అరుదు.

Andre Russel: బీపీఎల్ మ్యాచ్ లో విచిత్రంగా ఔటైన ఆండ్రే రస్సెల్

Andre Russel

Andre Russel: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు భలే గమ్మత్తు దృశ్యాలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని సంఘటనలు సీరియస్ గా ఉంటే మరికొన్ని సరదాగా ఉంటాయి. కానీ విచిత్ర సంఘటనలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) క్రికెట్ మ్యాచ్ లో ఆండ్రే రస్సెల్ ఔటైన తీరు అలాంటి విచిత్ర సంఘటనే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2022 (BPL 2022) ఇటీవల బంగ్లాదేశ్ లోని ఢాకా వేదికగా ప్రారంభమైంది. శుక్రవారం నాడు.. మినిస్టర్ గ్రూప్ ఢాకా మరియు ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది.

Also read: Tamil Nadu Lockdown : తమిళనాడులో కరోనా కల్లోలం.. ఈ ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌..

మినిస్టర్ గ్రూప్ తరుపున ఆడుతున్న ఆండ్రే రస్సెల్..జట్టు కెప్టెన్ మహ్మదుల్లాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఖుల్నా టైగెర్స్ బౌలర్ తిసారా పెరెరా వేసిన బంతిని రస్సెల్ డిఫెన్సె ఆడి.. రన్ కోసం ప్రయత్నిస్తుండగా..”షార్ట్ థర్డ్ మాన్”(వికెట్స్ కి కుడివైపు నుండే ఫీల్డర్) ఫీల్డర్ బంతిని స్ట్రైకర్ వైపు విసిరాడు. స్ట్రైకర్స్ వైపునున్న వికెట్లను తాకిన బంతి అనూహ్యంగా నాన్ స్ట్రైకర్ వైపు వెళ్ళింది. నాన్ స్ట్రైకింగ్ నుంచి వచ్చిన మహ్మదుల్లా సమయానికి క్రీజులోకి అడుగుపెట్టడంతో నాట్ ఔట్ గా నిలిచాడు. అదే సమయంలో బంతి దానంతట అదే వెళ్లి నాన్ స్ట్రైకర్ వైపునున్న వికెట్లను తాకింది.

Also read: Janasena : సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన వ్యక్తితో పార్టీకి సంబంధం లేదన్న జనసేన

అప్పటికి రస్సెల్ ఇంకా క్రీజులోకి అడుగుపెట్టకపోవడంతో.. ఖుల్నా టైగర్స్ ఆటగాళ్లు ఔట్ కి అప్పీల్ చేశారు. థర్డ్ ఎంపైర్ రివ్యూ అనంతరం.. నాన్ స్ట్రైకింగ్(Non-Striking)లోకి వచ్చిన రస్సెల్ రన్ ఔట్ గా నిర్ధారించగా.. విచిత్రంగా ఔట్ అయి రస్సెల్ పెవిలియన్ దారి పట్టాడు. రస్సెల్ ఔటైన తీరు క్రికెట్ ఆటలోనే అరుదుగా జరిగే దృశ్యం. వికెట్లు ఎదురెదురుగా ఉన్నపుడు బంతిని విసిరితే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడం సాధారణం, కానీ పక్కనుంచి వచ్చిన బంతి ఒకేసారి స్ట్రైకర్, నాన్ స్ట్రైకర్ వికెట్లను తాకడం అరుదుగా జరిగే పరిణామం. ఇక తాను ఔటైన తీరుకు ఆండ్రే రస్సెల్ సైతం నవ్వుకోగా.. ఈ మ్యాచ్ చూసిన అభిమానులు అయ్యో పాపం రస్సెల్ అంటూ ఉసూరుమన్నారు. ఈ మ్యాచ్ లో ఖుల్నా టైగెర్స్ జట్టు విజయం సాధించింది.