Tokyo Olympics 2021 : జావలిన్ త్రో విభాగం నుంచి ఒలంపిక్స్ కు అర్హత సాధించిన అన్ను రాణి

నేడు (జులై23) జపాన్ లోని టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. కోచ్ లు ఇతర సిబ్బందితో కలిసి 228 అంది సభ్యుల బృదం జపాన్ వెళ్ళింది. ఈ 119 మంది ఆటగాళ్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సభ్యుల పరంగా చూస్తే.. ఈ సారి ఎక్కువమంది టోక్యో వెళ్లారు.

Tokyo Olympics 2021 : జావలిన్ త్రో విభాగం నుంచి ఒలంపిక్స్ కు అర్హత సాధించిన అన్ను రాణి

Tokyo Olympics 2021

Tokyo Olympics 2021 : నేడు (జులై23) జపాన్ లోని టోక్యో నగరంలో ఒలంపిక్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలకు భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. కోచ్ లు ఇతర సిబ్బందితో కలిసి 228 అంది సభ్యుల బృదం జపాన్ వెళ్ళింది. ఈ 119 మంది ఆటగాళ్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సభ్యుల పరంగా చూస్తే.. ఈ సారి ఎక్కువమంది టోక్యో వెళ్లారు. జులై 23న జరిగే అర్చరీతో భారత్ తన ప్రయాణం మొదలు పెట్టనుంది. ఇక ఒలంపిక్ గేమ్స్ ఆగస్టు 8వ తేదీ వరకు జరగనున్నాయి.

ఇదిలా ఉంటే మీరట్ కు చెందిన జావలిన్ త్రోయర్ అన్ను రాణి ఒలంపిక్స్ కు అర్హత సాధించారు. ప్రపంచ ర్యాంక్ కోటా ఆధారంగా ఆమె స్థానం దక్కించుకున్నారు. రెండవ కోటాలో ఈమెకు స్థానం దక్కింది. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా అన్నును సెలక్ట్ చేశారు. ఈమె ప్రస్తుతం 11 ర్యాంక్ లో ఉన్నారు. తాజాగా జరిగిన ఫెడరేషన్ ట్రోఫీలో అన్ను 63.24 మీటర్లు జావలిన్ త్రో చేసి జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటానని తెలిపారు. ఆటపై ఇంకా పట్టు సాధించాల్సి ఉందని వివరించారు. తన లక్ష్యం 70 మీటర్లు అని తెలియచేశారు. కాగా 2000 తర్వాత జావెలిన్ త్రో విభాగంలో అర్హత సాధించిన అథ్లెట్ అన్నునే.. 2000 సిడ్నీ ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో విభాగం నుంచి గురుమీత్ కౌర్ పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో ఎవరు అర్హత సాధించలేదు. 2021లో అన్ను రాణి అర్హత సాధించారు.