Anushka Sharma: ఏంటిది అనుష్క.. కోహ్లినే స్లెడ్జింగ్ చేస్తావా..!
విరాట్ లండన్‌కు వెళ్లడానికి ముందు సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అనుష్క.. కోహ్లిని స్లెడ్జింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Anushka Sharma Sledges Virat Kohli
Anushka Sharma-Virat Kohli: ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore )కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సీజన్‌లో కూడా లీగ్ దశకే పరిమితమైంది. 16 సీజన్లుగా ఒక్కసారి కూడా ఆర్‌సీబీ కప్పును గెలవలేకపోయింది. ఐపీఎల్ టైటిల్ అనేది ప్రస్తుతానికి ఆర్‌సీబీకి అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లి(Virat Kohli) ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాడు.
కాగా..విరాట్ లండన్‌కు వెళ్లడానికి ముందు సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అనుష్క.. విరాట్ కోహ్లిని స్లెడ్జింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఏం ఉందంటే..?
అనుష్క శర్మను యాంకర్‌గా ఉన్న వ్యక్తి కోహ్లిని స్లెడ్జింగ్ చేయమని కోరతాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా వెనుక నిలుచున్న అనుష్క.. “ఛలో చలో విరాట్.. ఈ రోజు ఏప్రిల్ 24, పరుగులు చేసే సమయం ఇది.” అంటూ కోహ్లిని స్లెడ్జింగ్ చేస్తుంది. అనంతరం విరాట్‌ని వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది. ‘నన్ను రీ ఎంట్రీ చేయనివ్వండి’ అంటూ విరాట్ అంటాడు. ‘జూన్, జూలైలో మీ జట్లు ఎన్ని మ్యాచ్‌లు ఆడినా పరుగుల చేయదు’ అంటూ టీజ్ చేశారు.
Fun moments between Virat Kohli and Anushka Sharma.
Anushka imitating Virat’s celebration was the best! pic.twitter.com/e3ono4oXlG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2023
అనంతరం ప్రత్యర్థి వికెట్ పడినప్పుడు మైదానంలో విరాట్ కోహ్లి హావ భావాలు ఎలా ఉంటాయో చేసి చూపించాలని అనుష్కను కోరగా అచ్చం విరాట్‌గానే చేసింది. ఇది చూసిన కోహ్లి బాగా నవ్వుకున్నాడు. ఆ తరువాత ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రంలోని రణ్‌వీర్ సింగ్ డైలాగ్‌ను చెప్పి విరాట్ నువ్వులు పూయించాడు. ఈ సినిమాలో అనుష్క శర్మ హీరోయిన్‌గా నటించింది అన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో విరుష్క జంట చేసిన హంగామా ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు ఓ గుడ్‌న్యూస్.. మరో బ్యాడ్‌న్యూస్..!
ఇదిలా ఉంటే.. లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకున్న టీమ్ఇండియా ఈ సారి ఎలాగైనా టెస్టు ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. మొదటి సారి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.