Anand Mahindra: మన టైం వచ్చేసింది – ఆనంద్ మహీంద్రా

ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది.

Anand Mahindra: మన టైం వచ్చేసింది – ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

Anand Mahindra: ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లో ఇండియా గెలుపొందడం ఇదే తొలిసారి. భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

73 ఏళ్ల థామస్, ఉబర్ కప్ చరిత్రలో భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా బలమైన ఇండోనేషియాను చిత్తు చేసి తేరుకోనీయకుండా చిత్తు చేసి భారత జట్టు చరిత్ర లిఖించింది.

దేశానికి స్వర్ణం అందించిన టీమిండియాకు భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ థాకూర్ కోటి రూపాయల నజరానా ప్రకటించారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ విజయం నాంది అని ట్వీట్ చేశారు.

Read Also: మదర్స్ డేకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

థామస్ కప్ గురించి చదువుతూ పెరిగానని, ఇండోనేషియాకు చెందిన రూడీ హర్టోనో వంటి టైటాన్లు ఆధిపత్యం చెలాయించారని గుర్తు చేసుకుంటూ.. “ఈ రోజు మనం అలాంటి ఇండోనేషియాను తుడిచిపెట్టేశాం” అని పేర్కొన్న ఆనంద్ మహీంద్రా.. ‘అప్నా టైం ఆగయా’ అంటూ ట్వీట్ చేశారు.