Kerala: అర్జెంటీనా, ఫ్రాన్స్ అభిమానుల మధ్య ఘర్షణ.. ముగ్గురిపై కత్తి దాడి

ఇండియాలో కూడా ఫుట్‭బాల్‭కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్‭బాల్‭ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం కేరళలో ఒక ఘర్షణ జరిగింది. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలలలో అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫుట్‭బాల్‭ జెర్సీలు వేసుకుని ఉన్నాయి

Kerala: అర్జెంటీనా, ఫ్రాన్స్ అభిమానుల మధ్య ఘర్షణ.. ముగ్గురిపై కత్తి దాడి

Kerala: ఫిఫా ప్రపంచ కప్ ముగిసింది. అర్జెంటీనా కల 36 ఏళ్ల అనంతరం నెరవేరింది. ఫ్రాన్స్, అర్జెంటీనాల మధ్య నరాలు తెగె ఉత్కంఠ అనంతరం పెనాల్టీ షూటౌట్‭తో గెలుపోటములు తేలిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అర్జెంటీనా అభిమానులు సంబరాల్లో హోరెత్తుతుంటే, ఫ్రాన్స్ అభిమానులు నైరాశ్యంలో మునిగిపోయారు. మొత్తానికి క్రీడాభిమానులకు ఈ ప్రపంచ కప్ పెద్ద పండగలా గడిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‭బాల్‭కు ఉన్న క్రేజ్ అది. అయితే ఇండియాలో ఈ ఆటకు అంత ఆదరణ లేదనుకుంటారు.

Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

కానీ, ఇండియాలో కూడా ఫుట్‭బాల్‭కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్‭బాల్‭ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం కేరళలో ఒక ఘర్షణ జరిగింది. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలలలో అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫుట్‭బాల్‭ జెర్సీలు వేసుకుని ఉన్నాయి. ఇప్పటికే అర్థం అయి ఉంటుందిగా.. వారు ఫుట్‭బాల్‭ వీరాభిమానులని.

Dhamaka : టీవీ, యూట్యూబ్, ఈవెంట్స్.. మొదటిసారి ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ..

తమ అభిమాన జట్టు గెలిచిందని అతితో కొందరు, తమ అభిమాన జట్టు ఓడిందనే నైరాశ్యంలో కొందరు.. ఇలా ఒకరికొకరు తగువులాటకు దిగారు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. అందులోని ముగ్గురు వ్యక్తులపై కత్తులతో దాడులు సైతం జరిగాయట. ఇందులో ఒకరు చాలా సీరియస్ కండీషనులో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్రాన్స్ అభిమానుల్ని అర్జెంటీనా అభిమానులే ముందుగా రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, అనంతరం ఇరు వర్గాల వారు బాహాబాహీకి దిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.