Sarfaraz Naushad Khan: నా కుమారుడు అన్న ఆ ఒక్క మాట నా హృదయాన్ని కరిగించింది: సర్ఫరాజ్ ఖాన్ తండ్రి

ఓ సారి తన కుమారుడు తన వద్దకు వచ్చి అర్జున్‌ టెండూల్కర్ చాలా అదృష్టవంతుడని అన్నాడని సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ చెప్పారు. ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ వద్ద కార్లు, ఐపాడ్స్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడని తెలిపారు. దీంతో తనకు మాటలు రాలేదని, మౌనంగా ఉండిపోయానని అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన కుమారుడు సర్ఫరాజ్‌ మళ్ళీ తన వద్దకు వచ్చి అర్జున్ టెండూల్కర్ కంటే తానే అదృష్టవంతుడినని చెప్పాడని అన్నారు.

Sarfaraz Naushad Khan: నా కుమారుడు అన్న ఆ ఒక్క మాట నా హృదయాన్ని కరిగించింది: సర్ఫరాజ్ ఖాన్ తండ్రి

Sarfaraz Naushad Khan: సర్ఫరాజ్‌ ఖాన్‌.. భారత క్రికెట్ అభిమానులందరికీ ఈ పేరు సుపరిచితమే. 25 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ రంజీ ట్రోఫీలో ముంబై తరఫున, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కి క్రికెట్ అభిమానులు మంత్రముగ్ధులు అవుతుంటారు. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ లోకి ప్రవేశించి, మైదానంలో అద్భుత ఆటతీరుతో మెరుస్తున్నాడు. సర్ఫరాజ్‌ నౌషద్ ఖాన్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

తన కుమారుడితో గతంలో జరిగిన ఓ సంభాషణను గుర్తు తెచ్చుకున్నారు. తన కుమారుడు సర్ఫరాజ్‌, సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్ అప్పట్లో జూనియర్‌ లెవెల్‌ నుంచి ముంబై జట్టులో ఆడేవారని తెలిపారు. ఓ సారి తన కుమారుడు తన వద్దకు వచ్చి అర్జున్‌ టెండూల్కర్ చాలా అదృష్టవంతుడని అన్నాడని చెప్పారు.

ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ వద్ద కార్లు, ఐపాడ్స్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడని తెలిపారు. దీంతో తనకు మాటలు రాలేదని, మౌనంగా ఉండిపోయానని అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన కుమారుడు సర్ఫరాజ్‌ మళ్ళీ తన వద్దకు వచ్చి అర్జున్ టెండూల్కర్ కంటే తానే అదృష్టవంతుడినని చెప్పాడని అన్నారు.

‘నాతో నా తండ్రి రోజులో చాలాసేపు గడుపుతారు. కానీ, అర్జున్ టెండూల్కర్ నాన్న మాత్రం అతడితో అంతసేపు గడపలేడు’ అని చెప్పాడని గుర్తుచేసుకున్నారు. దీంతో తాను ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యానని నౌషద్‌ ఖాన్‌ తెలిపారు. కాగా, క్రికెట్లో సర్ఫరాజ్‌ ఖాన్‌ కు అతడి తండ్రి ప్రోత్సాహం చిన్నప్పటి నుంచి ఎంతో ఉంది. కుమారుడి టాలెంట్ ను గుర్తించి దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో చోటు సంపాదించుకోవాలంటే తీవ్రపోటీ ఉంది. త్వరలోనే సర్ఫరాజ్ ఖాన్ టెస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉంది.

Athia Shetty-KL Rahul : అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం.. అతిథులు ఎంతమంది, వాళ్లకి రూల్స్ ఏంటో తెలుసా?