Rohit Sharma: అర్జున్ టెండూల్కర్‌‌కు ఈ సారైనా ముంబై జట్టులో చోటు దక్కేనా? రోహిత్ శర్మ సమాధానం ఇదే

దేశవాళీ ఆటలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్‌ ఐపీఎల్‌కు కూడా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని నామమాత్రపు ధరకు దక్కించుకుంది. 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టుకు ఎంపికై రెండేళ్లు గడుస్తున్నా... అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు.

Rohit Sharma: అర్జున్ టెండూల్కర్‌‌కు ఈ సారైనా ముంబై జట్టులో చోటు దక్కేనా? రోహిత్ శర్మ సమాధానం ఇదే

Rohit Sharma: అర్జున్ టెండూల్కర్.. పేరు చూడగానే అర్థమై ఉంటుంది. సచిన్ టెండూల్కర్ కొడుకు అని. తండ్రిలాగే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో అడుగులేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో బ్యాటింగ్‌తోపాటు, బౌలింగ్‌లోనూ అర్జున్ మంచి రికార్డే నమోదు చేశాడు.

10th Exams: ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

దేశవాళీ ఆటలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్‌ ఐపీఎల్‌కు కూడా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని నామమాత్రపు ధరకు దక్కించుకుంది. 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టుకు ఎంపికై రెండేళ్లు గడుస్తున్నా… అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. గత రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ఈసారైనా అతడికి తుది జట్టులో చోటుంటుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను మీడియా ఇదే అంశంపై ప్రశ్నించింది. అర్జున్ టెంటూల్కర్‌కు ఈ ఐపీఎల్‌లోనైనా ఆడే అవకాశం వస్తుందా అని ప్రశ్నించింది.

Karnataka Polls: కర్ణాటకలో ఏప్రిల్ 5 నుంచి రాహుల్ గాంధీ ప్రచారం.. ఒంటరిగానే గెలుస్తామని కాంగ్రెస్ ధీమా

దీనికి స్పందించిన రోహిత్.. ఈసారి అతడికి ఛాన్స్ దక్కొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిజానికి అర్జున్ కొంతకాలంగా గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని, ఇటీవలే తిరిగి జట్టులో చేరాడు. ప్రస్తుతం ఆట ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడి ఆటతీరు ఆధారంగా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలున్నాయని కోచ్ బౌచర్ గతంలోనే చెప్పాడు.