Arjuna awardee: అర్జున అవార్డు గ్రహీత, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం కన్నుమూత

భారత మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు నందు నటేకర్ కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. దేశం కోసం అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన భారత మొట్టమొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్ నందు.

Arjuna awardee: అర్జున అవార్డు గ్రహీత, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం కన్నుమూత

Nandu

Nandu Natekar: భారత మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు నందు నటేకర్ కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. దేశం కోసం అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన భారత మొట్టమొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్ నందు. అతను 1956 సంవత్సరంలో ఈ ఘనతను సాధించాడు.

1950-60 మధ్య కాలంలో బ్యాడ్మింటన్ విభాగంలో స్టార్ ఆటగాడిగా నందు ఉన్నారు. తన బ్యాడ్మింటన్ కెరీర్‌లో, నందు నటేకర్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇదేకాకుండా ఆరు సార్లు జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆయనకు 1961 సంవత్సరంలో అర్జున అవార్డు లభించింది. ఈ అవార్డును అందుకున్న మొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్ నందూనే.

నందు నటేకర్ మొదట క్రికెటర్ కావాలని అనుకున్నాడు. క్రికెట్ కూడా చాలా బాగా ఆడేవాడు. కానీ అతని మనస్సు క్రికెట్‌లో నిలవలేదు. తన దృష్టిని బ్యాడ్మింటన్ వైపు మరల్చి. బ్యాడ్మింటన్‌లో రికార్డులు క్రియేట్ చేశారు.  1953 లో 20 ఏళ్ళ వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ లో టోర్నమెంట్లో విజయం సాధించాడు.

థామస్‌ కప్‌లో 16 సింగిల్స్‌ మ్యాచ్‌లో 12 విజయాలు.. అలాగే టీమ్‌ తరపున 16 డబుల్స్‌ మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించారు. 1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు నందూ.