Women’s Premier League: పోటీలో ఇంతమందా.. మహిళా ప్రీమియర్ లీగ్ వేలం కోసం భారీగా పోటీ పడుతున్న ఆటగాళ్లు

ఇప్పటివరకు మెన్స్ ఐపీఎల్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లకు గుర్తింపు దక్కింది. ఆర్థికంగానూ ప్రయోజనం కలిగింది. అందుకే త్వరలో ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రికెటర్లు భారీగా పోటీ పడుతున్నారు.

Women’s Premier League: పోటీలో ఇంతమందా.. మహిళా ప్రీమియర్ లీగ్ వేలం కోసం భారీగా పోటీ పడుతున్న ఆటగాళ్లు

Women’s Premier League: దేశంలో బీసీసీఐ తీసుకొచ్చిన ఐపీఎల్ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పటివరకు మెన్స్ ఐపీఎల్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లకు గుర్తింపు దక్కింది. ఆర్థికంగానూ ప్రయోజనం కలిగింది.

NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ

అందుకే త్వరలో ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రికెటర్లు భారీగా పోటీ పడుతున్నారు. తాజా అంచనా ప్రకారం మహిళా ఐపీఎల్ వేలం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభం కానున్న మహిళా ఐపీఎల్ కోసం బీసీసీఐ ఐదు జట్లను ఖరారు చేసింది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో పోటీ పడబోతున్నాయి. ఈ ఐదు జట్లు కలిసి మొత్తం 100-120 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వేలం ఈ నెల రెండో వారంలో మొదలవుతుంది.

Women’s T20 World Cup 2023: ఈ నెల 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే

మన దేశంలోని క్రీడాకారులే కాకుండా, విదేశాలకు చెందిన క్రీడాకారులు కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. త్వరలో నిర్వహించనున్న వేలం ఆరోగ్యకర వాతావరణంలో జరుగుతుందని బీసీసీఐ భావిస్తోంది. డబ్ల్యూపీఎల్‌కు సంబంధించి జట్ల కేటాయింపు పూర్తైంది. దీని కోసం జరిగిన వేలంలో బీసీసీఐకి భారీ ఆదాయం దక్కింది.

2008లో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించినప్పటికంటే మహిళా జట్ల ద్వారా మరింత ఎక్కువ ఆదాయం సమకూరిందని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా తెలిపారు. ఐదు జట్లకు నిర్వహించిన వేలం ద్వారా రూ.4669.99 కోట్లు బీసీసీఐకి దక్కాయి.