‘భారత్‌లో స్పిన్ బౌలింగ్ కళ చచ్చిపోతుంది’

‘భారత్‌లో స్పిన్ బౌలింగ్ కళ చచ్చిపోతుంది’

మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ స్పిన్ బౌలింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సాంప్రదాయ బౌలర్ల చేతిలో స్పిన్ బౌలింగ్ కళ చచ్చిపోతుందని కామెంట్ చేశాడు. భారత్ కు ప్రాతినిధ్యం వహించి 8టెస్టులు, 37వన్డేలు ఆడిన కార్తీక్ క్వాలిటీతో కూడిన స్పిన్ బౌలింగ్ కరువైందని అంటున్నాడు. 

‘మనకు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, డేనియల్ వెట్టోరీ లాంటి స్పిన్నర్లు కావాలి. అదింకా మనం మిస్సవుతున్నాం. వారికున్న విపరీతమైన పోటీ కారణంగా చాలా మంది స్పిన్నర్లు తమ రాష్ట్ర స్థాయి జట్లకు ఎంపిక కాక దూరంగా ఉండిపోతున్నారు. కానీ, ప్రస్తుతం భారత స్పిన్ బౌలింగ్ అంతగా లేదు. పాతకాలం నాటి బౌలర్లు చేసినంతగా దాడి చేయలేకపోతున్నారు’ 

ఇవే స్పిన్ బౌలింగ్‌లో నాణ్యత తగ్గిపోతుందనడానికి నిదర్శనాలు అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. 43ఏళ్ల మురళీ కార్తీక్.. భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.